WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బాపట్లకు రూ.3.35కోట్లు నిధులు మంజూరు...!

బాపట్ల నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికై రూ.3.35కోట్లు నిధులు మంజూరైయ్యాని ఆయా నిధులతో పలు గ్రామాలు అభివృద్ధిబాటలో పయనించడం ఖాయమని ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి మరియు ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ తెలిపారు. శనివారం ఆయన మీడియా వర్గాలతో మాట్లాడుతూ దేశానికి పట్టుకొమ్మలైన గ్రామీణ ప్రాంతాల అభివృద్దికి ఆ శాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ప్రతి చిన్న సమస్యను గుర్తించి పరిష్కారం అందించే దిశగా పనిచేస్తున్నారని, ఈ శాఖకు 'చినబాబు' కళాకాంతులు తెప్పించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బాపట్ల నియోజకవర్గంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా రెండు కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయని 'సతీష్‌' తెలిపారు. అత్యంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 'బాపట్ల' నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ద చూపుతూ తనను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారని, తన జీవితంలో 'చంద్రబాబు, చినబాబులను మరిచిపోయే ప్రసక్తేలేదని వారిద్దరికీ వీరవిధేయుడుగా పదువులు ఆశించకుండా జీవితాంతం కొనసాగుతానని 'సతీష్‌' చెప్పారు. 

  బాపట్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికా బద్ధమైన కృషిని కొనసాగిస్తున్నానని 'అన్నం' చెప్పారు. బాపట్ల మండలంలోని అప్పికట్ల నుండి ఎన్టీఆర్‌ విగ్రహం ఉన్న ముస్లిం కాలనీ మీదుగా సిసి రోడ్ల నిర్మాణానికి రూ.50లక్షలు, యాజిలి-గుడిపూడి మీదుగా మాసవరం వరకు నూతనంగా నిర్మించబోయే రోడ్ల నిర్మాణానికి రూ.85లక్షలు నిధులు మంజూరైనట్లు 'అన్నం' చెప్పారు. గుంటూరు జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో బాపట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉత్తమ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని, ఈ విషయంలో అధికారులు తనకు పూర్తిగా సహకరిస్తున్నారని 'అన్నం' చెప్పారు. 'చినబాబు' గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్‌శాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అభినందనలు తెలిపానని, బాపట్ల నియోజకవర్గానికి అత్యధిక నిధులు మంజూరు చేయడానికి ఆయన హామీ ఇచ్చారని 'అన్నం' తెలిపారు.

(188)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ