WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పోల‌వ‌రం ఆగిపోవాల‌ని వాళ్ళు కోరుకుంటున్నారు...!

 పోలవరం స్పిల్ వే పనులను ముఖ్య మంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఎండతీవ్రతలో కూడా పోలవరం పనులు జరుగుతున్న తీరును ఆయన అధికారులను అడిగితెలుసుకున్నారు. పోలవరం పనుల ప్రగతిపై అధికారులకు సూచనలు చేశారు. జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో చంద్రబాబు సమీక్ష నిర్వహిచారు. పోలవరం పనులను వేగంగా పూర్తిచేస్తామని ఆయన తెలిపారు. పోలవరం పనుల పురోగతి సంతృప్తికరంగా ఉందన్నారు.గేట్ల నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. పవర్‌ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మంత్రులు పితాని సత్యనారాయణ, జవహర్ నాయుడు పాల్గొన్నారు. కొందరు స్వార్థ రాజకీయ నేతలు కోర్టులకు వెళ్లి పోలవరం పనులను అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. 

  ఒక్కరోజు పని ఆగిపోతే రూ.కోట్లలో నష్టం వస్తోందని ఆయన అన్నారు. పోలవరం పనుల పురోగతి సంతృప్తికరంగా ఉందని, ఇంకా ముమ్మరం చేయాల్సి ఉందని, రాబోయే రోజుల్లో పోలవరం పనులు మరింత వేగవంతం చేస్తామని, గేట్ల నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయని, మొత్తం 48 గేట్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని అన్నారు. ఇప్పటికి ఐదు గేట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. 2019 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. సమష్టిగా పనిచేస్తేనే పోలవరం పనులు త్వరితగతిన పూర్తయివుతాయని, పవర్‌ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని చంద్రబాబు చెప్పారు. కొందరు స్వార్థ రాజకీయ నేతలు కోర్టులకు వెళ్లి..పోలవరం పనులకు అడుగడుగునా అడ్డుపడుతున్నారని సీఎం మండిపడ్డారు.పని అయితే మీ గొప్ప.. పని కాకుంటే ఇతరుల తప్పు అన్నట్టుగా వ్యవహరించడం సరికాదని అధికారులకు చంద్రబాబు చురకలంటించారు. పోలవరం పనుల ప్రగతిపై అధికారులకు సూచనలు చేశారు. వచ్చే వారం పోలవరంపై ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు.

(311)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ