WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రాజమౌళి'కి షాక్‌...!

దర్శకధీరుడు 'రాజమౌళి'కి భారీ షాక్‌ తగిలింది. తన కలల ప్రాజెక్టు అయిన 'మహాభారత్‌' సినిమాను ఇప్పుడు అంతర్జాతీయ దర్శకుడు ఒకరు తీయబోతున్నారు. ఈ మేరకు ప్రాజెక్టు వివరాలను వారు ఈ రోజు ప్రకటించారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను వి.ఎ.శ్రీకుమార్‌ మేనన్‌ నిర్మించనున్నారు. యూఏకి చెందిన వ్యాపారవేత్త 'మహాభారత్‌' చిత్రానికి పెట్టుబడి పెట్టబోతున్నారట. 2018లో సినిమా నిర్మాణాన్ని ప్రారంభించి 2020 నాటికి కల్లా చిత్రాన్ని విడుదల చేయాలని వారు భావిస్తున్నారట. ఈ చిత్రానికి హాలీవుడ్‌ దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నారు. ముందుగా ఆరు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించి తరువాత వంద భాషల్లో చిత్రాన్ని డబ్‌ చేయబోతున్నారట.

   'బాహుబలి' చిత్రంతో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న దర్శకధీరుడు 'రాజమౌళి' తన కలల ప్రాజెక్టు 'మహాభారత్‌'ను తీయాలనుందని పలుసార్లు తన మనసులోని మాటను బయటకు వెల్లడించారు. అయితే ఈ సినిమాకు పెట్టుబడి పెట్టేవారు లేరని, చిత్రానికి ఎంత సమయం పడుతుందో తనకు తెలియదని, అందుకే ఈ ప్రాజెక్టు అయ్యే పని కాదంటూ అప్పుడప్పుడు వ్యాఖ్యానించారు. అయితే మనసులో ఉన్న కోర్కెను నెరవేర్చుకోవడానికి ఆయన తీవ్రంగా కృషి చేసిన సందర్భం లేదు. కేవలం దాన్ని ఊహగానే సరిపెట్టుకున్నారు. అసలు చేద్దామని ప్రయత్నిస్తే నిర్మాతలు దొరకడం పెద్ద కష్టమేమీ అయ్యేది కాదు...'బాహుబలి'తో బాలీవుడ్‌ను ఆకర్షించిన 'రాజమౌళి' 'మహాభారత్‌'ను తీస్తానని బహిరంగంగా ప్రకటించినట్లయితే నిర్మాతలు ఈజీగానే దొరికేవారు. కానీ ఆయన బద్దకించడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టు వేరే వారి చేతిలోకి వెళ్లిపోయింది. మొత్తం మీద 'రాజమౌళి' కలల ప్రాజెక్టు  మరొకరు తన్నుకుపోయినట్లే.


(2021)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ