WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'హరీష్‌' కాంగ్రెస్‌లోకి వెళ్లరు...!

రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి 'తన్నీరు హరీష్‌రావు' కాంగ్రెస్‌ పార్టీలోకి వెళతారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, ఆయన ఆ పార్టీలోకి వెళ్లరని మున్సిపల్‌శాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తనయుడు కె.తారకరామారావు స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో 'హరీష్‌రావు' కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని వస్తోన్నవార్తలపై మంత్రి కెటిఆర్‌ స్పందించారు. 'హరీష్‌రావు' పార్టీ మారే ప్రసక్తేలేదని, ఆయనకు ఆ అవసరం ఏముందని ప్రశ్నించారు. పలు మీడియా సంస్థలకు 'హరీష్‌రావు' ఇస్తోన్న ఇంటర్వ్యూలు యాదృచ్చికంగా జరుగుతున్నాయే తప్ప...పనిగట్టుకుని చేస్తున్నవి కాదని, తమ ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన అన్నారు. 

  తనకు ఇప్పటికిప్పుడు సిఎం అవ్వాలన్న కోరిక లేదని,  మరో పదేళ్లు కెసిఆర్‌ ముఖ్యమంత్రిగా ఉంటారని, ఇప్పుడు ఆయన వయస్సు 64సంవత్సరాలని, ఇదేమంత పెద్ద వయస్సు కాదని, ఇప్పుడు వారసత్వం కోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదన్నారు. తనకూ...మంత్రి హరీష్‌రావుకు మధ్య మంచి అవగాహన ఉందని తెలిపారు. దేశంలో కాంగ్రెస్‌ పని అయిపోయిందని, ఇక బిజెపి కూడా గుజరాత్‌లో గెలిచే పరిస్థితి లేకనే అక్కడ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తోందని ఆయన విమర్శించారు. ముందస్తు ఎన్నికలు వస్తే తాము సమర్థవంతగా ఎదుర్కొంటామని, రేపు ఎన్నికలు వచ్చినా తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.


(907)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ