WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆ...పేపర్‌ చదివితే స్మోకింగ్‌ చేసినట్లేనట...!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు రాష్ట్ర పంచాయితీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్‌  ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌కు చెందిన 'సాక్షి' పత్రికపై ధ్వజమెత్తారు. ఆ పత్రిక తన గురించి దొంగ వార్తలు రాస్తుందని...అటువంటి పత్రిక చదవడం స్మోకింగ్‌ చేసినంత ప్రమాదకరమని ఆయన ప్రజలను హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తన గురించి, తన తండ్రి గురించి నిత్యం అబద్దాలు రాస్తుందని, దొంగలు పెట్టిన పేపర్‌ దొంగ వార్తలు రాస్తూ తనకు, తండ్రికి మధ్య విభేదాలు సృష్టించాలని ప్రయత్నిస్తోందని అన్నారు. తనకు హోం మంత్రి చినరాజప్పకు మధ్య విభేదాలు ఉన్నాయని అబద్దాలు రాస్తుందని ఇటువంటి పేపర్‌ చదివితే స్మోకింగ్‌ చేసినన్ని అనర్ధాలు కలుగుతాయని ఆయన అన్నారు. కాగా ఇదే సభలో పాల్గొన్న హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ 'నారా లోకేష్‌' కాబోయే సిఎం అంటూ సంబోధించారు.  


(331)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ