WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అక్రిడిటేటెడ్‌ జర్నలిస్టులు మాత్రమె ప్రెస్‌ స్టిక్కర్లు పెట్టుకోవాలి

అనంతపురం ఏప్రిల్ 19:: జిల్లాలోని అక్రిడిటేటెడ్‌ జర్నలిస్టులకు ప్రెస్‌ స్టిక్కర్లు అందజేసేందుకు జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు చర్యలు తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రత్యే క ప్రకటన ద్వారా తెలియజేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల విజ్ఞప్తికి ఆయన పరిష్కారం చూపినట్లయింది. జర్నలిస్టులు కాకపోయినప్పటికీ పలువురు వాహనాలపై ‘ప్రెస్‌’ పేరుతో స్టిక్కర్లు అతికించుకుని దర్జాగా తిరుగుతూ..నిజమైన జర్నలిస్టులకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలుమార్లు జర్నలిస్టులు జిల్లా ఎస్పీని కలిసి ప్రెస్‌ స్టిక్కర్లు తగిలించుకుని చలామణి అవుతున్న వారికి అడ్డుకట్ట వేయాలని విన్నవించారు. ఈ మేరకు అక్రిడిటేటెడ్‌ జర్నలిస్టులకు పోలీసు శాఖ తరపున స్టిక్కర్లు ఇవ్వాలని కోరారు. ఎట్టకేలకు జిల్లా ఎస్పీ ప్రెస్‌ స్టిక్కర్లు అందజేసేందుకు ఆమోద ముద్ర వే శారు. స్టిక్కర్ల కోసం అక్రిడిటేటెడ్‌ జర్నలిస్టులు ఈ నెల 21వ తేదీ లోగా వారివారి వివరాలను జిల్లా పోలీసుకార్యాలయం ఆవరణలోని ఈ-సర్వేలెన్స్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో అందజేయాలని సూచించారు. జర్నలిస్టులు ఒక ఫొటోతోపాటు, అక్రిడిటేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు జిరాక్సు కాపీలు, ద్విచక్ర, లేదా కారు వివరాలు తెలిపే ఆర్సీ జిరాక్స్‌ కాపీలందజేయాలన్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే మూడు రోజుల్లోగా ప్రెస్‌ స్టిక్కర్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

(226)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ