WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రైలు ప్రమాదంపై తక్షణం స్పందించిన జిఎం...!

ఔరంగాబాద్‌-హైదరాబాద్‌ పాసింజర్‌ రైలు ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే  జనరల్‌ మేనేజర్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ తక్షణం స్పందించారు.  శుక్ర‌వారం నాడు ఔరంగాబాద్‌-హైదరాబాద్‌ ప్యాసింజర్‌ రైలు కర్నాటకలోని కలగాపూర్‌ మరియు భలాకి రైల్వే స్టేషన్‌ల మధ్య   1.50గం.టలకు  పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇంజన్‌తో పాటు మరో మూడు ప్యాసింజర్‌  కోచ్‌లు పట్టాలు తప్పాయి. ప్రమాద సమయంలో రైలులో 500 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరూ గాయపడలేదని రైల్వే వర్గాలు ధృవీకరిస్తున్నాయి.  
ప్రమాదం గురించి తెలిసినవెంటనేే దక్షిణ మధ్య రైల్వే జిఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌ వెంటనే స్పందించి ప్రమాద స్థలానికి వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణీకులను వేర్వేరు బస్సుల్లో బీదర్‌కు తరలించారు. హైదరాబాద్‌ ప్రయాణీకులను బీదర్‌-హైదరాబాద్‌ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో వారి గమ్యస్థానాలకు చేర్చారు. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పోలీసులు ప్రయాణీకుల బ్యాగులకు, ఇతర వస్తువులను అందించడంలో సహాయం చేశారు. హెల్ప్‌లైన్‌ నెంబర్లను హైదరాబాద్‌, ఔరంగాబాద్‌, పార్లీ, బీదర్‌, భలక్కీ మరియు వికారాబాద్‌లో అందుబాటులో ఉంచారు. ప్రమాద కారణాలపై రైల్వేపోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రమాదంపై జిఎం  హైలెవల్‌ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తున్నారు.


(956)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ