WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

‘సాహోరే బాహుబలి’ వీడియో సాంగ్‌ ప్రోమో విడుదల

ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విజువల్‌ వండర్‌ 'బాహుబలి' ది కన్‌క్లూజన్‌ మరో ఆరు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన 'సాహోరే బాహుబలి' సాంగ్‌ ప్రొమోన్‌ చిత్ర హీరో ప్రభాస్‌ ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. అద్బుతమైన గ్రాఫిక్స్‌తో ఈ సాంగ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో బాహుబలి పట్టాభిషేకం తరువాత అతనిని కీర్తిస్తూ పాడే పాటలో దృశ్యాలను చూపించారు. అదే విధంగా యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు రోమాలను నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. ప్రభాస్‌,రాణా, అనుష్క, తమన్నా, నాజర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకధీరుడు రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ నెల 28వ తేదీన చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.




(315)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ