WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌' పరామర్శపై గ్రామస్తుల ఆగ్రహం...!

చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మునగలపాలెం బాధితుల కుటుంబాలను ఓదార్చడానికి వెళ్లిన వై.ఎస్‌.జగన్‌పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శ పేరుతో గ్రామంలోకి దండయాత్రలా 'జగన్‌' పార్టీ వారు వచ్చారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వై.ఎస్‌.జగన్‌ భారీ కాన్వాయ్‌లతో గ్రామంలోకి ప్రవేశించారు. ఆయన వెంట వచ్చిన వైకాపా నేతలు, కార్యకర్తలు జై..జగన్‌...జై వైకాపా అంటూ నినాదాలు చేసుకుంటూ గ్రామాన్ని హోరెత్తించారు. ఒక వైపు తమ ఆత్మీయులు మరణించిన క్షోభలో బాధితులు ఉంటే వారిని ఓదార్చాల్సిపోయి రాజకీయ సభలా నినాదాలు చేయటంపై గ్రామస్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అసలు మీరు పరామర్శకు వచ్చారా...లేక..రాజకీయ మీటింగ్‌కు వచ్చారా...? మీ పరామర్శలు మాకొద్దు...ముందు ఊరు నుంచి బయటకు వెళ్లండి...అంటూ వారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటంతో వైకాపా నేతలు సర్ది చెప్పి పర్యటనను కొనసాగిస్తున్నారు. కాగా 'జగన్‌' ఓదార్పుపౖౖె సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


(152)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ