WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

త‌ప్పుడు రాతలు రాసిన సాక్షిపై కేసు పెడతా...కోర్టుకీడుస్తా..

నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్థిపనులపై,త‌న‌పై,తమ పార్టీపై సాక్షి దినపత్రికలో అసత్యాలతో కూడిన కథనాలు ప్రచురితమవుతున్నాయని,వాటిని సోషల్‌ మీడియాలో ఉంచుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కారణంగా సాక్షి దిన‌ప‌త్రిక‌పై కేసుపెడతా..కోర్టుకీడుస్తా నంటూ శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్‌ ఒకింత తీవ్ర అసహనం,ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తప్పుడు వ్రాతలు రాయ‌డ‌మే కాకుండా..., సోషల్‌ మీడియాలో వాటిని ఉంచుతున్న‌సాక్షి మీడియాను తీవ్రంగా హెచ్చరించారు.నియోజకవర్గంలో అభివృద్థి వేగవంతంగా జరుగుతుందన్నారు.ప్రజలు కూడా అభివృద్థి పనుల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు.వైకాపా నాయకులు తమ మనుగడను కాపాడుకోవటం కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.గతంలో మోపిదేవి వెంకటరమణారావు మంత్రిగా ఉన్న కాలంలో పట్టణంలో కానీ,నియోజకవర్గంలో కాని చేసిన అభివృద్థి ఏమిటో,ఈమూడేళ్ళల్లో మేము చేసిన అభివృద్థి ఏమిటో బహిరంగ వేదికపై చర్చించేందుకు సిద్థమా అంటూ సత్యప్రసాద్‌సవాల్‌ విసిరారు.

 నియోజకవర్గంలో ఇప్పటికే వైకాపా మనుగడ కోల్పోయిందన్నారు.ప్రజలు వైకాపాను పట్టించుకోవటం లేదని చెప్పారు.అమావాస్యకు,పౌర్ణానికి ఒకసారి వచ్చి మేమున్నామంటూ ప్రజలను మోసం చేస్తున్నారని అనగాని విమర్శించారు.వైకాపా కార్యకర్తలను,నాయకులను  పట్టించుకునే ప‌రిస్థితిలో వెంక‌ట‌ర‌మ‌ణ లేర‌ని, అర్థంపర్థం లేని వ్యాఖ్యలతో ప్రజల్లో చులకన అవుతున్న మాట వాస్తవమా కాదా అంటూ అనగాని ప్రశ్నించారు.నియోజకవర్గ అభివృద్థిలో ప్రజలు భాగస్వాములు కావటంపట్ల వైకాపానేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.నియోజకవర్గంలో ఇప్పటికే పెనుమూడి,లంకేవానిదిబ్బ రహదారి,రేపల్లె,నిజాంపట్నం రహదారి,సజ్జావారిపాలెం,నగరం రహదారి,నగరం,చెరుకుపల్లి రహదారి,సజ్జావారిపాలెం,కనగాల రహదారి,మంత్రిపాలెం,హరీస్‌పేట రహదారి మార్గాలను నాలుగు లైన్లుగా విస్తరించే పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. మూడేళ్ళ క్రితం వరకు తీరప్రాంత ప్రజలు ఇంత అభివృద్థిచూసి ఎరుగుదురా అని ఆయన వైకాపా నేతలను ప్రశ్నించారు.పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల నుండి  అభివృద్థి కార్యక్రమాల వరకు చేస్తున్నామని అనగాని గుర్తుచేశారు.రానున్న రెండేళ్ళల్లో నియోజకవర్గంలో పారిశ్రామికవాడ, పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అనగాని చెప్పారు.సాక్షి దినపత్రికలో వ‌స్తోన్న‌అసత్య వార్తలను శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్‌ ఖండించారు.నియోజకవర్గంలో వైకాపాకు మనుగడ లేదని అనగాని సత్యప్రసాద్‌ స్పష్టం చేశారు.


(389)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ