WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

గ‌ద్ద‌ర్ ఆశ‌లు ఫలించేనా?

తెలంగాణ‌లో అధికార ప‌క్షం టీఆర్ ఎస్ కు ఎదురు లేకుండా పోయింది. ప్ర‌తిప‌క్షాలు ఉన్న‌ప్ప‌టికి ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయి. టీఆర్ ఎస్‌కు వ్య‌తిరేకంగా నిరుద్యోగుల ప‌క్షాన నిలిచి పోరాటం చేస్తున్న ప్రొఫెస‌ర్ కొదండ‌రాంకు సొంత ఫోరం నుంచి వ్య‌తిరేక‌త ఎద‌ర‌వుతుంది. ఈ నేప‌థ్యంలో టీఆర్ ఎస్ ను ఎదుర్కోగ‌ల స‌త్తా ఉన్న బ‌ల‌మైన ప‌క్షం అవ‌స‌రం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాని కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా మాట్లాడేందుకు ఎవ‌రూ సాహ‌సించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ టీఆర్ ఎస్ ప్ర‌త్యామ్న‌య‌మైన కూట‌మిని ఏర్పాటు చేసే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్టు తెలుస్తుంది. 

  ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఉద్య‌మించే గ‌ద్ద‌ర్ ఈ సారి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాటం చేయ‌డానికి సిద్ద‌మ‌వుతున్నార‌ని స్ప‌ష్టం మ‌వుతుంది. ఈ నేప‌థ్యంలో బ‌ల‌మైన నాయకుల‌ను ఏకం చేసే ప్ర‌య‌త్నాలు కూడా మొద‌లు పెట్టార‌ట‌. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో క‌లిసి తెలంగాణ‌లో ప‌నిచేసేందుకు తాను సిద్ధమే అని గ‌ద్ద‌ర్ ప్ర‌క‌టించాడు. ప‌వ‌న్ ఈ విష‌యంపై ఇంకా స్పందించ‌లేదు. ఆయ‌న గ‌నుక గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే మ‌రిన్ని రాజ‌కీయ పార్టీలు, జేఏసీలు, ఉద్య‌మ సంఘాలు సైతం మ‌ద్దతు ప్ర‌క‌టిస్తాయ‌ని గ‌ద్ద‌ర్ ఆశ‌లు పెట్టుకున్నాడు. గ‌ద్ద‌ర్ ఆశ‌లు, ప్ర‌య‌త్నం స‌ఫ‌ల‌మ‌వుతే బ‌ల‌మైన రాజ‌కీయ ప‌క్షం తెలంగాణలో ఆవిర్భ‌విస్తుంద‌డ‌టంతో సందేహం లేదు.

(198)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ