WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నరసింహన్ పదవీ కాలం మరో మారు పొడిగింపు ?

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పదవీ కాలం వచ్చేనెల 2తో ముగియనుంది. ఈలోపే ఆయన్ను కొనసాగించేందుకు ఉత్తర్వులు వెలువడుతాయనే ప్రచారం సాగుతోంది. 2010 జనవరి నుంచి ఆయన గవర్నర్ గా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో గవర్నర్ గా నియమించిన ఆయన్ను 2012 మే3న మరో ఐదేళ్ల పాటు గవర్నర్ గా కొనసాగిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. బీజేపీ ప్రభుత్వం ఆయన జోలికి పోలేదు. గవర్నర్‌ నరసింహన్‌ ను తొలగించాలని మొదట్లో టీడీపీ నేతలు బాహాటంగానే డిమాండ్ చేశారు. కాలం మారింది . ఇరు రాష్ట్రాల సి.ఎంలతో సయోధ్యతోనే ఆయన వెళుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నెలకున్న చాలా సమస్యలను ఆయన దగ్గరుండి పరిష్కరిస్తున్నారనే అభిప్రాయం కేంద్రంలో ఉంది. అందుకే మరో విడత ఆయన పదవీ కాలాన్ని పొడిగించే అవకాశాలున్నాయి. ఇటు కేసీఆర్, అటు చంద్రబాబుల సమ్మతితోనే ఆయన్ను కొనసాగించేందుకు ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. ప్రధాని మోదీతో భేటీ అయిన తెలంగాణ సి.ఎం కేసీఆర్ సైతం గవర్నర్ పదవీ కాలం పొడిగింపు పై మాట్లాడరంటున్నారు. నరసింహన్ కు మద్దతుగా కేసీఆర్ చెప్పారని తెలుస్తోంది. ప్రధాని మోదీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం. ఛత్తీస్‌ గఢ్‌ గవర్నర్‌గా పనిచేసిన గవర్నర్ నరసింహన్ తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు.

 

(241)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ