బాలీవుడ్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి వినోద్‌ఖన్నా(70)మృతి చెందారు. కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న వినోద్‌ఖన్నా గురువారం తుది శ్వాస విడిచారు. 1946 అక్టోబరు 6న పాకిస్థాన్‌లోని పెషావర్‌లో వినోద్‌ఖన్నా జన్మించారు. 1971లో గీతాంజలితో వినోద్‌ఖన్నా వివాహం జరిగింది. వినోద్‌ఖన్నాకు ఇద్దరు కుమారులు.. రాహుల్ ఖన్నా, అక్షయ్ ఖన్నా ఉన్నారు. 1990లో కవితతో వినోద్ ఖన్నా రెండో వివాహం జరిగింది. మన్ కా మీట్ (1968) అనే చిత్రంతో సినీపరిశ్రమలోకి వినోద్ ఖన్నా అడుగుపెట్టారు. 1971లో హమ్ తుమ్ ఔర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వినోద్ ఖన్నా.. 141 చిత్రాల్లో నటించారు. హీరా ఫేరీ, ఖూన్ పసీనా, అమర్ అక్బర్ ఆంతోనీ, మకద్దర్ కా సికందర్, హాత్ కీ సఫాయీ ప్రేమ్ కహానీ, కుద్రత్, రాజ్ పుత్, దీవానాపన్, రెడ్ అలర్ట్, ది వార్ వితిన్, వాంటెడ్, దబాంగ్, ఫేస్ ఆఫ్ ట్రూత్, గాడ్ ఫాదర్, రిస్క్ చిత్రాల్లో నటించిన వినోద్‌ఖన్నా నాలుగు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగు పెట్టిన వినోద్ ఖన్నా 1997లో బీజేపీలో చేరారు. 1999, 2004, 2014లో మొత్తంగా మూడు సార్లు గుర్దాస్పూర్ ఎంపీగా గెలిచారు. 2002లో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రిగా వినోద్ ఖన్నా పనిచేశారు. వినోద్ ఖన్నా మరణవార్త విన్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
క్షమించాలి మీరు వార్త మీద ఇష్టం లేదా వ్యతిరేకత ఇవ్వాలంటే మీరు లాగిన్ అయి ఉండవలెను .
LOGIN
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే ఇష్టపడి ఉన్నారు
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే వ్యతిరేకించి ఉన్నారు
అభిప్రాయాలూ