WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మంత్రులు జీతం తీసుకోవ‌టం చ‌ట్ట‌విరుధ్ధం...!

 మంత్రులు కూలీ పని చేసి జీతం తీసుకోవడం చట్టవిరుద్ధమని.. దానిపై ఈసీకి ఫిర్యాదుచేస్తామని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. కూలీ చేసి డబ్బులు తీసుకున్న మంత్రులను అనర్హులుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఓయూలో టీఆర్‌ఎస్‌కు ఘోరీ కడతామని విద్యార్థులు హెచ్చరించారన్నారు. ఓయూ అంటే 4 కోట్ల ప్రజల మనోభావాలకు వేదికని చెప్పారు. తమని ఓయూ శతాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించలేదని మండిపడ్డారు. ఏ రైతు రాజు అయ్యాడో కేసీఆర్‌ చెప్పాలని ప్రశ్నించారు. 3వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయం సీఎంకు తెలుసా అని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న 35 నిర్ణయాలను కోర్టులు కొట్టేశాయని ఎద్దేవా చేశారు.

(65)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ