WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఊపిరి పీల్చుకున్న జ‌గ‌న్...!

 బెయిల్‌ రద్దు అంశంలో వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టులో వూరట లభించింది. జగన్‌కు బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు తీర్పు ప్రకటించింది. జగన్ బెయిల్‌ను రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. జగన్ తరపు న్యాయవాదుల వాదనతో కోర్టు ఏకీభవించింది. అంతేకాదు జగన్ విదేశీ పర్యటనకు కూడా కోర్టు అనుమతినిచ్చింది. మే15 నుంచి జూన్ 15 లోపు ఏవైనా 15రోజులు విదేశీ పర్యటనకు వెళ్లి రావొచ్చని కోర్టు తెలిపింది. అక్రమాస్తుల కేసులో అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చిన జగన్‌ షరతులను ఉల్లఘించారని.. అందువల్ల ఆయన బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ న్యాయస్థానంలో పిటిషన్‌ వేసింది. జగన్‌ ఉద్దేశపూర్వకంగానే సాక్షులను బెదిరిస్తున్నారని.. కోర్టులో విచారణను కూడా ప్రభావితం చేసేలా ప్రవరిస్తున్నారని సీబీఐ ఆరోపించింది. 

 ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌రెడ్డి సాక్షి పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూనే ఇందుకు నిదర్శనమని సీబీఐ కోర్టుకు పేర్కొంది.అయితే సీబీఐ ఆరోపణలను జగన్‌ తరపు న్యాయవాదులు తోసిపుచ్చారు. సాక్షి నిర్వహణతో గానీ.. రమాకాంత్‌రెడ్డి ఇంటర్వ్యూలో ఈ కేసు విచారణను ప్రభావితం చేసే అంశాలు లేవని పేర్కొన్నారు. వూహాజనిత అంశాలతో బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోరడం సమంజసంగా లేదని వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం సీబీఐ పిటిషన్‌ను కొట్టివేసింది.మే 15 నుంచి జూన్‌ 15 మధ్య 15 రోజుల పాటు న్యూజిలాండ్‌ వెళ్లేందుకు సీబీఐ న్యాయస్థానం జగన్‌కు అనుమతి ఇచ్చింది. వేసవి సెలవుల కారణంగా కుటుంబంతో కలిసి విహారయాత్ర నిమిత్తం న్యూజిలాండ్‌ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్‌ న్యాయస్థానాన్ని కోరారు.కోర్టు తీర్పు పట్ల వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. న్యాయస్థానంలో తమ పార్టీ అధినేతకు న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశాయి. జగన్ మీడియాలో మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ సాక్షులను ప్రభావితం చేసే విధంగా ఉందని, జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్ వేసిన సీబీఐకి కోర్టు తీర్పుతో చుక్కెదురైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి న్యూజిల్యాండ్ కు వెళ్లేందుకు సిద్దమయ్యారు. మే 15నుంచి జూన్ 15వరకు తనకు అనుమతి ఇవ్వాలని జగన్ సిబిఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కు కోర్ట్ అనుమతిన్చెంది. ఒకవేళ బెయిల్ ను రద్దు చేయక పోతే జగన్ కుటుంబ సభ్యులతో కలిసి న్యూజిలాండ్ వెళ్లే అవకాశముంది. తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు,వాడివేడి రాజకీయాలకు జగన్ కాస్తంత దూరంగా ఉండాలనుకుంటున్నారట. అందుకే కాస్తంత సమయాన్ని కుటుంబ సభ్యులకు కేటాయించేందుకు ఆయన సిద్దమయ్యారంటున్నారు. ఎప్పుడూ ఉండే రాజకీయాలే..ఆ తర్వాత కుటుంబానికి సమయం కేటాయించడం తక్కువ అవుతుంది. అందుకే ముందుగానే టూర్ కు ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. గతంలో విదేశాలకు టూర్ కు వెళ్లిన జగన్ మధ్యలోనే తిరిగి వచ్చారని..అనధికారికంగా తన భేటీలను కీలక నేతలతోజరిపారనే వాదన వచ్చింది. విషయం ఏదైనా ఈ సారి న్యూజిలాండ్ పేరుతో జగన్ బీజేపీ నేతలతో పాటు..కొంత మంది ప్రముఖులను కలుస్తారనే ప్రచారం జరుగుతోంది.

(385)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ