WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

హైద‌రాబాద్ లో ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం....!

అల్ప‌పీడ‌న ద్రోణి ప్ర‌భావంతో హైద‌రాబాద్ లో శుక్ర‌వారం సాయంత్రం ప‌లు ప్రాంతాల‌లో భారీ వ‌ర్షం కురిసింది. మండే ఎండ‌లకు అల్లాడిపోతున్న జ‌నాల‌కు ఈ రోజు కురిసిన వ‌ర్షం స్వాంత‌న క‌లిగించాయి.ఉత్తర తెలంగాణ నుంచి శ్రీలంక తీరంలోని కొమురిన్‌ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. జార్ఖండ్‌, ఒడిశా పరిసరాల్లో మరో ద్రోణి నెలకొన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, చిత్తూరు, కడపలో క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో ఉరుములుతో కూడిన జల్లులు, ఓ మోస్తరు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాయలసీమలో ఎండల తీవ్రత సాధారణం కంటే 2 లేదా 3 డిగ్రీలు అదనంగా నమోదవుతాయని తెలిపారు. కానీ తెలంగాణలో చెదురుమదురుగా వర్షాలు పడతాయని.. మరో నాలుగురోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అంతే కాదు… రెండు నుంచి మూడు డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు తగ్గనున్నట్లు తెలిపారు. కాగ తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సాయంత్రం వాతావరణం చల్లబడినా ఉక్కపోత మాత్రం తగ్గలేదు.

(377)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ