WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

‘అనంత’లో తెప్ప బోల్తా.. 14మంది మృతి

అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ఎర్రతిమ్మరాజు చెరువు గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఇక్కడి వైటీ చెరువులో తెప్ప బోల్తాపడిన ఒకే కుటుంబానికి చెందిన 13మంది మృతిచెందారు. మరో 6గురు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో తెప్పలో మొత్తం 19 మంది ప్రయాణిస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణించడమే ప్రమాదానికి కారణమైంది. ఓ శుభకార్యానికి హాజరైన వీరంతా విహారయాత్ర కోసం తెప్పలో ప్రయాణించి ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. గల్లంతైన వారి ఆచూకీ గుర్తించాల్సి ఉంది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.

(254)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ