WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎస్సీ వర్గీకరణ జోలికి వస్తే పుట్టగతులుండవ్‌

 రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ జోలికి వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పుట్టగతులుండవని పి.వి.రావు వర్గం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నత్తా యోనారాజు వెల్లడించారు. మే 10న పి.వి.రావు 65వ జయంతిని పురస్కరించుకొని యోనారాజు అనంతపురం నుండి శ్రీకాకులం వరకు గత 24వ తేది నుండి రాష్ట్ర వ్యాప్తంగా మాలల మహాపాదయాత్ర చేపట్టారు. శనివారం కడపకు చేరుకున్న యోనారాజు బృందం జిల్లాలో పర్యటించి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ ఎక్కడా ఎస్సీలను వర్గీకరించాలని చెప్పలేదన్నారు. కలసి ఉద్యమాలు చేసి రాజ్యాధికారం దక్కించుకోవాలని హితవు పలికాడని అయితే కొంతమంది స్వార్థపరులు తమ ప్రయోజనం కోసం మాల, మాదిగలను విడదీశారని ఆరోపించారు. ఎస్సీ కులాల విషయంలో రాజ్యాంగంలో ఆర్టికల్‌ 341 ప్రకారం అస్పృశ్యతకు గురౌతున్న కులాలను ఎస్సీలో చేర్చవచ్చన్న విధంగా రాజ్యాంగం రూపొందించిందన్నారు. కాలం చెల్లిన వర్గీకరణ అంశాన్ని కొంతమంది మల్లీ తెరపైకి తెచ్చి మాల మాదిగల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. 

  2004లో సుప్రీమ్‌ కోర్టు వర్గీకరణ చెల్లదండూ తీర్పు ఇచ్చినప్పటికీ దానిని ఖాతరు చేయకుండా ఇటీవల కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వర్గీకరణకు మద్ధతునివ్వడం విచారకరం అన్నారు. గతంలో వర్గీకరణకు మద్ధతిచ్చిన చంద్రబాబు గత 9 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాల మాదిగల ఐక్యత కోసం పాటుపడాలని హితవు పలికారు. 15 శాతం ఉన్న రిజర్వేషన్‌ను నేటి జనాభా ప్రతిపదికన 22 శాతానికి పెంచాలని డిమాండు చేశారు. ఈ పాదయాత్ర కడప నుండి బయలు దేరి నెల్లూరుకు చేరుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం బాల రమేష్‌ కుమార్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంటి ప్రశాంత్‌, రాయలసీమ జిల్లాల ఇన్‌ఛార్జి రాజశేఖర్‌ బాబు, ఎంప్లాయిస్‌ రాయలసీమ ఇన్‌ఛార్జి జగదీష్‌, ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జి లాలం దావీదు, శ్రీకాకుళం జిల్లా ఇన్‌ఛార్జి గెడ్డం నరేష్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం నుండి వచ్చిన యోనారాజు బృందానికి కడపలో భవనాసి సుదర్శనం, గోర్ల శ్రీనివాసులు, ఇరగదిండ్ల బాలవీరప్పలు ఘనస్వాగతం పలికారు. 

(160)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ