WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మే 15 వరకు దినకరన్‌కు జ్యుడిషియల్‌ కస్టడీ

రెండాకుల గుర్తు కోసం ఎన్నికల అధికారికి లంచం ఇవ్వబోయిన వ్యవహారంలో అరెస్టయిన అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు జ్యుడిషియల్‌ కస్టడీ విధించారు. దినకరన్‌ పోలీస్‌ కస్టడీ నేటితో ముగియడంతో ఆయనను దిల్లీలోని తిస్‌ హజారీ కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం తదుపరి దర్యాప్తు కోసం దినకరన్‌కు మే 15 వరకు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది.రెండాకుల గుర్తు వ్యవహారంలో ఎన్నికల సంఘం అధికారి ఒకరికి రూ. 50కోట్లు లంచం ఇవ్వబోయారన్న ఆరోపణలతో దినకరన్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

 ఇటీవల దళారి సుఖేశ్‌ చంద్రశేఖర్‌ను దిల్లీపోలీసులు అరెస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు దినకర్‌ను చెన్నై తీసుకెళ్లి అక్కడ ఆయనకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. బ్యాంకు ఖాతాల నుంచి లావాదేవీలను పరిశీలించారు. దినకరన్‌ ఖాతా నుంచి భారీ మొత్తంలో నగదు బదిలీ అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో తదుపరి విచారణ కోసం ఆయనను తిరిగి దిల్లీ తీసుకొచ్చారు. కస్టడీ ముగియడంతో నేడు న్యాయస్థానంలో హాజరుపరచగా.. దినకరన్‌, ఆయన సన్నిహితుడు మల్లికార్జున్‌కు మే 15వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు.

(200)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ