WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

విదేశీ విహారయాత్రల ముందు దొంగదీక్షలా...!

విదేశీ విహారయాత్రలకు కోర్టుల నుంచి అనుమతి తీసుకున్న వై.ఎస్‌.జగన్‌ తాజాగా దొంగ నిరాహారదీక్షలు చేయటంలో పరమార్థం ఏమిటి...?రైతులను మోసం చేసేందుకే ఆయన దీక్షలు చేస్తున్నారని ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్‌ ఆరోపించారు. రాష్ట్ర రైతాంగ బాగోగులు కోసం అనుక్షణం తపన పడుతున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబేనని దీనిని రైతులు కూడా అంగీకరిస్తున్నారని అటువంటి నాయకునిపై విమర్శలు, ఆరోపణలు 'జగన్‌' చేస్తే ప్రజలు తరిమికొడతారని 'అన్నం' హెచ్చరించారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న 'జగన్‌' ప్రజా సమస్యలపై సూచనలు,సలహాలు ఇవ్వకుండా కాబోయే ముఖ్యమంత్రిని నేనేనంటూ అధికారులను బెదిరించడం, ప్రగల్బాలు పలకడం 'జగన్‌'కే చెల్లిందని 'అన్నం' విమర్శించారు. ప్రజల్లో పట్టుకోల్పోతున్నామనే భయంతోనే దొంగ దీక్షలు చేస్తున్నారని ఆయన  దుయ్యబట్టారు. అసెంబ్లీలో సమయాన్ని వృధా చేస్తూ ప్రచారానికి పాటుపడే 'జగన్‌' తాజాగా దీక్షలను ఎంపిక చేసుకున్నారని అన్నారు. 

  అవినీతి, అంహకారం ఉన్న వారిని ఏం చేయాలో ప్రజలకు తెలుసనని, ఇప్పటికే ఒకసారి చెంప చెల్లుమనేలా తీర్పు ఇచ్చారని మళ్లీ అదే విధంగా జరుగుతుందని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షనాయకునిపై ఏ సమస్యలపై పోరాటం జరిపించారో వివరించాలని 'సతీష్‌' డిమాండ్‌ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు 'జగన్‌' కాంగ్రెస్‌, తల్లి కాంగ్రెస్‌లదేనని సంగతి ఆయనకు తెలియదా...? కాంగ్రెస్‌ ప్రభుత్వ పునాదులపై పుట్టిన పిల్ల కాంగ్రెస్‌ 'జగన్‌' పార్టీ అని అదే విషయం ప్రజలందరికి తెలుసనని చిత్తశుద్ది లేకుండా స్వంత ప్రయోజనాలనే పరమావధిగా భావిస్తూ దొంగ దీక్షలు చేస్తున్న 'జగన్‌, ఆయన పార్టీ సోదిలో లేకుండా పోతుందని 'అన్నం' జోస్యం చెప్పారు. అధికార దాహంతో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారే తప్ప రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో లోటుపాటులు ఉంటే ఎత్తి చూపాలే తప్ప ఆ పథకాలను తప్పుపట్టడంపై 'సతీష్‌' అభ్యంతరం వ్యక్తం చేశారు.

(360)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ