WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

దమ్ముంటే ఢిల్లీలో దీక్ష చేయి...!

రైతు దీక్షపేరుతో గుంటూరులో దీక్ష చేయటం సరికాదని, దమ్ముంటే ఢిల్లీలో దీక్ష చేయాలని 'జగన్‌'కు ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ సవాల్‌ విసిరారు. మంగళవారం నాడు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు రోజుల దీక్షలో రైతుల కన్నా వ్యవసాయంపై అవగాహన లేని వారే ఎక్కువ మంది కనిపించారని 'అన్నం' విమర్శించారు. అప్పుడప్పుడు తన ఉనికిని చాటుకునేందుకు ఇలా దొంగదీక్షలు చేస్తుండడం ఆయనకు పరిపాటేనని, దీక్షలతో సమస్యలు పరిష్కారం కావని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతాంగాన్ని ఆదుకునే విధంగా 'జగన్‌' వ్యవహరించాలని ఆయన సలహా ఇచ్చారు. స్వంత పత్రిక 'సాక్షి', ఛానెల్‌ ద్వారా అవాస్తవ కథనాలు ప్రచారం చేయిస్తూ...సోషల్‌మీడియాలో కట్టుకథలు ప్రచారం చేయిస్తున్న విధానాన్ని మానుకోకుంటే 'జగన్‌'ను 'జనం' తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని 'అన్నం' హెచ్చరించారు. ఒకవైపు నిద్రాహారాలు మాని రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవాస్త ఆరోపణలతో వార్తలు రాయిస్తున్నారని, ఇలాంటి అవాస్తవ వార్తలు ప్రచురిస్తే గతంలో టిడిపి ప్రభుత్వంపై ఇటువంటి కథనాలే రాసిన పత్రికలకు ఎదురయిన గతే 'సాక్షి'కి ఎదురవుతుందని 'అన్నం' హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొట్టాలనుకుంటే 'మిర్చి' ఘాటు నషాళానికి అంటేలా వారు రుచి చూపిస్తారని 'అన్నం' హెచ్చరించారు. తన దీక్షకు రైతుల హాజరు తక్కువగా ఉండడంతో వాహనాల ద్వారా జనాలను తరలించారని పార్టీ నాయకులు, కార్యకర్తలు కిరాయి జనం రైతులా...? వారు లేకుండా రైతు దీక్ష ఏమిటని 'జగన్‌'ను అన్నం నిలదీశారు. 'జగన్‌' అవినీతి చరిత్ర అందరికీ తెలుసునని ఇప్పటికే ఆయన బెయిల్‌పై బయటఉన్నారని త్వరలో ఆయనకు శృంగభంగం తప్పదని ఆయన దుయ్యబట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రపతిని కలిసిన 'జగన్‌' రైతు సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వ పాలకులను ఎందుకు కలవలేకపోతున్నారు అని ఆయన ప్రశ్నించారు. అనేక కేసుల్లో ఎ1గా ఉన్న 'జగన్‌' తన అవినీతి సొమ్మును కాపాడుకోవడానికి, అధికార దాహాన్ని తీర్చుకునేందుకు పార్టీని స్థాపించారని, ఎ2,ఎ3,ఎ4లతో కోటరి ఏర్పాటు చేసుకుని దొంగలపార్టీగా తీర్చిదిద్దారని అన్నం దుయ్యబట్టారు. రైతుల మనోభావాలను దెబ్బతీయవద్దని, వారికి అండదండలుగా ఉండాలంటే కేంద్రంపై ఒత్తిడి తేవాలని 'సతీష్‌' 'జగన్‌'కు సలహా ఇచ్చారు.




(219)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ