WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పదేళ్ల వరకు 'తిరుమల'కు రారాజునే...!

తిరుమల జెఇఒగా మరో పదేళ్ల వరకు తానే కొనసాగుతానని శ్రీనివాసరాజు ధీమా వ్యక్తం చేస్తున్నారట. గతంలో బాలసుబ్రహ్మణ్యం జెఇఒగా తొమ్మిదేళ్లు బాధ్యతలు నిర్వహించి రికార్డు సృష్టించారని తాను పదేళ్ల వరకు అదే పోస్టులో కొనసాగి ఆయన రికార్డును బద్ధలు కొడతానని శ్రీనివాసరాజు చెబుతున్నారట. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నప్పుడు జెఇఒగా నియమితులైన శ్రీనివాసరాజు తిరుమలలో ఆయన పదవిలో ఉన్నంత కాలం ఒక వెలుగు వెలిగారు. అప్పట్లో కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు ఒకరు శ్రీనివాసరాజుతో సన్నిహితంగా మెలిగేవారట. వారి అండదండలతో అప్పటి ఇఒలను కూడా శ్రీనివాసరాజు ఖాతరు చేసేవారు కాదు. ప్రతిపక్షనాయకుని హోదాలో 'చంద్రబాబు' తిరుమలకు వచ్చినప్పుడు కనీసం మర్యాదపూర్వకంగానైనా శ్రీనివాసరాజు ఆయనను కలవలేదు. ఇదే విషయంలో అప్పట్లో విలేకరులు 'చంద్రబాబు'ను ప్రశ్నించగా అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పడం జరిగింది. 

   ఆ విధంగా వ్యవహరించిన శ్రీనివాసరాజునే యధావిధంగా 'చంద్రబాబు' కొనసాగించడం టిటిడి వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఎవరెవరిని ఎలా పట్టుకుంటారో...ఏమి మాయచేస్తారో కానీ శ్రీనివాసరాజు బదిలీ మళ్లీ తాత్కాలికంగా తెరపడింది.  తిరుమల ఇఒ పోస్టు పొందేందుకు విశ్వప్రయత్నాలు చేసి విఫలమైన శ్రీనివాసరాజు జెఇఒ పోస్టుతోనే సరిపెట్టుకునేందుకు సిద్ధం అయ్యారు. శ్రీనివాసరాజును తప్పనిసరిగా బదిలీ చేస్తారని సిఎంఒ వర్గాలు ఆఫ్‌ ది రికార్డుగా మీడియా వర్గాలకు వెల్లడించినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన ఊసే ఎత్తడం లేదట. ఎవరో ముఖ్య లేదా ప్రముఖ వ్యక్తులు శ్రీనివాసరాజుకు అండగానిలుస్తున్నారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన పదేళ్ల వరకు తిరుమల జెఇఒగా కొనసాగిస్తారా...? అక్కడి నుంచి తప్పిస్తారా? అనే విషయం ఈ మాసాంతానికి కానీ బయటపడనుంది. ఇఒ సాంబశివరావును బదిలీ చేసి 'అనిల్‌కుమార్‌ సింఘాల్‌'ను నియమించడంతో తనకు ఆ పోస్టు దక్కదని తెలుసుకున్న శ్రీనివాసరాజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ పోస్టు కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. 'చంద్రబాబు'కు సన్నిహితులైన 'క్షత్రియ' వర్గానికి చెందిన నాయకుల చుట్టూ శ్రీనివాసరాజు ప్రదిక్షణలు చేసినా వారు సిఫార్సు చేయడానికి అంగీకరించడం లేదట.

(567)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ