WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రధాని మోదీకి ఓ సెక్స్ వ‌ర్క‌ర్ ట్వీట్

త‌న ద‌గ్గ‌ర ప‌ది వేల వ‌ర‌కు పాత నోట్లు ఉన్నాయ‌ని, వాటిని ఎలా మార్చుకోవాలో చెప్పాలంటూ కోరుతూ  ప్రధాని న‌రేంద్ర మోదీకి ఓ సెక్స్ వ‌ర్క‌ర్ ట్వీట్ చేసింది. ప్ర‌ధాని మోదీతోపాటు విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్‌కు కూడా ఆమె ట్వీట్ చేసింది. తాను ఎలా వేశ్య‌గా మారింది.. ఆ డ‌బ్బు ఎలా వ‌చ్చింద‌న్న విష‌యాల‌న్నీ ఓ పేప‌ర్‌పై రాసి దానిని వారికి ట్వీట్ చేసింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఆ మహిళ‌ను పుణెలోని ఓ వేశ్యాగృహం నుంచి 2015, డిసెంబ‌ర్‌లో కాపాడారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ మాయ‌మాట‌లు చెప్పి ఇండియాకు ర‌ప్పించినకొంద‌రు..ఆమెనువేశ్య‌గామార్చేశారు. అయితే నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో ఆ డ‌బ్బంతా పుణెలో ఉన్న ఆ వేశ్యాగృహం నిర్వాహ‌కుల ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని, దీంతో వాటిని మార్చుకోలేక‌పోయాన‌ని ఆమె చెప్పింది. ఇప్పుడు వాటిని మార్చుకోవ‌డానికి సాయం చేయాల‌ని ట్వీట్‌లో మోదీని కోరింది. బంగ్లాదేశ్‌లోని ఓ బ‌ట్ట‌ల షాపులో ప‌నిచేసే త‌న‌ను 2013లో త‌నతోపాటు ప‌నిచేసే వ్య‌క్తి ఇండియాకు తీసుకొచ్చాడ‌ని ఆమె చెప్పింది. అత‌ను వ‌శి అనే వ్య‌క్తికి త‌న‌ను అప్ప‌గించ‌గా.. అత‌ను ఓ నేపాలీ మ‌హిళ‌కు రూ.50 వేల‌కు అమ్మేశాడ‌ని వెల్ల‌డించింది. అక్క‌డి నుంచి బెంగ‌ళూరుకు, ఆ త‌ర్వాత పుణెకు త‌ర‌లించ‌గా.. అక్క‌డే త‌న‌ను వేశ్య‌గా మార్చేశార‌ని ఆ మ‌హిళ చెప్పింది. ఏడాదిన్న‌ర త‌ర్వాత 2015, డిసెంబ‌ర్‌లో ఓ రెస్క్యూ ఫౌండేష‌న్ ఆమెకు కాపాడింది. ఆ స‌మ‌యంలో తాను సంపాదించిన రూ.ప‌ది వేలు ఈ మ‌ధ్యే త‌న చేతికి అందాయి. అయితే అవ‌న్నీ పాత నోట్లు కావ‌డంతో ఇప్పుడు వాటిని మార్చుకునే అవ‌కాశం ఇవ్వాల‌ని ఆమె ఏకంగా ప్ర‌ధాని మోదీకే ట్వీట్ చేసింది.

(356)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ