WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అవయవదానం'లో 'కోడెల' గిన్నిస్‌ రికార్డు...!

70వ జన్మదినోత్సవ సందర్భంగా అనేక సామాజిక చైతన్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి చరిత్ర సృష్టించారు శాసనసభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా నర్సరావుపేట, సత్తెనపల్లికి చెందిన పదివేల మందితో అవయవదాన అంగీకారపత్రాలను అందజేయాలని సంకల్పించారు. కోడెల పిలుపుతో ప్రజలు స్వచ్చంధంగా వచ్చి అవయవదానపత్రాలపై సంతకాలు చేశారు. ఒక గంటలో సుమారు 12వేల మందికి పైగా అవయవదాన పత్రాలపై సంతకాలు చేయటంతో గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. 'కోడెల' కూడా అవయవదానాలను చేస్తున్న పత్రాలపై సంతకాలు చేశారు. డాక్టర్‌ వృత్తితో ప్రజాభిమానం పొందిన డాక్టర్‌ కోడెల 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి 1983,85,89,94,99లలో వరుసగా ఐదుసార్లు నర్సరావుపేటలో విజయం సాధించి సంచలనం సృష్టించారు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల 2004,2009ల్లో ఓడిపోయినా ఆయన స్వంత మండలం సత్తెనపల్లిలో కలసిపోవడంతో అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తరువాత అధికార,ప్రతిపక్ష మద్దతుతో అత్యుతమ శాసనసభ స్పీకర్‌ పదవికి ఎన్నికయ్యారు. 

  స్పీకర్‌ పదవిని అంతకు ముందు ఎంతో మంది నిర్వహించినా 'కోడెల' నిర్వహిస్తున్న తీరును మేధావి వర్గాలు కూడా అభినందించాయి. ఇంటింటా మరుగుదొడ్డి పథకాన్ని సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో ప్రారంభించి ఆ పథకాన్ని విజయవంతం చేయడమే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సమస్యలను పరిష్కరించడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిన ఘనత కోడెలకే ఉంది. కోటప్పకొండ గుడిని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసి భక్తుల మన్నలను పొందారు. తాజాగా ఆయన అవయవదాన కార్యక్రమాన్ని ప్రారంభించి గిన్నిస్‌రికార్డు సాధించడమే కాకుండా ఇతరులకు మార్గదర్శిగా నిలిచారు. 

   అవయవదాన కార్యక్రమం విజయవంతంలో ఆయన కుమారుడు డాక్టర్‌ శివరామకృష్ణ రాత్రింభవళ్లు కష్టపడి కృషి చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ రోజు ఎన్నికలు జరిగినా 'కోడెల' కానీ ఆయన కుమారుడు కానీ ఆయన సూచించిన వ్యక్తి అయినా 20వేల మెజార్టీ సాధించడం ఖాయమని ఆయన అనుచరవర్గం అంటోంది. ఒకప్పుడు నర్సరావుపేటను టిడిపికి కంచుకోటగా మలిచిన కోడెల ఇప్పుడు సత్తెనపల్లిని కూడా అదే స్థాయికి తీసుకువచ్చి 'చంద్రబాబు' అభినందనలు అందుకున్న ఘనత 'కోడెల'కు ఆయన కుమారుడు శివరామకృష్ణకే దక్కింది.


(265)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ