WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తప్పటడుగులేసిన...'వివేకా'...!

2014ఎన్నికల్లో పోటీ చేయడానికే ముందుకు రాని, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఎన్నికల ఫలితాల అనంతరం సోదరుడితో కలసి టిడిపిలో చేరారు. కానీ కాంగ్రెస్‌లో అధికారం చెలాయించినట్లు 'చంద్రబాబు' ప్రభుత్వంలో అధికారం చెలాయించాలని చూసిన ఆయన దూకుడును అధికారులు పట్టించుకోలేదు. అంతే కాకుండా 'ఆనం' సోదరులకు తీవ్ర వ్యతిరేకి అయిన 'సోమిరెడ్డి'కి మంత్రి పదవి ఇవ్వటంతో మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అంతగా స్పందించకపోయినా...ఆయన సోదరుడు 'ఆనం వివేకానందరెడ్డి' మధ్యవర్తుల ద్వారా 'జగన్‌' పార్టీలో చేరేందుకుప్రయత్నించారు. తనను నీచాతినీచంగా తిట్టిన 'వివేకా'ను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేదని 'జగన్‌' తేల్చి చెప్పారు. 

   అంతకు ముందు 'వివేకా' పార్టీని వీడుతున్నారు...అని 'చంద్రబాబు'కు కొంత మంది నాయకులు చెప్పినట్లు 'పోతే పోనీయండి...ఆయన వల్ల ఒరిగేదేమీటి...? ఆయన సోదరుడుకు ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించాను...నిన్నకాక మొన్న చేరారు...ఎమ్మెల్సీ కావాలంటే ఎలా ఇస్తాను...అనేక మంది సీనియర్లుతో పాటు గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినవారున్నారు...వారందరినీ కాదని 'వివేకా'కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే ప్రసక్తేలేదని 'చంద్రబాబు' తేల్చి చెప్పారట. ప్రతిపక్షంలో ఉన్న 'చంద్రబాబు' వ్యంగ్య విమర్శలతో పాటు ఆధారాలు లేని విమర్శలు చేసిన వివేకా 'జగన్‌'పై కూడా అదే రీతిలో విమర్శలు చేసి సంచలనం సృష్టించారు. 'చంద్రబాబు' ఆ విషయం మర్చిపోయినా...'జగన్‌' మాత్రం సీరియస్‌గానే ఉన్నారు. నెల్లూరు జిల్లాలో తన తండ్రి ఆశీస్సులు, అండదండలతో రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగిన 'ఆనం సోదరులు' వ్యక్తిగత విమర్శలు చేయటం 'జగన్‌'కు మింగుడుపడలేదు. 

  గత ఎన్నికల్లో 'వివేకా' పోటీ చేయలేకపారిపోయారు...ఆయన సోదరడుకు ఆత్మకూరులో పట్టుమని పదివేల ఓట్లు కూడా రాలేదు. మా వల్ల వారు పైకి రావాలే తప్ప...వారు పార్టీలో చేరితే అదనంగా కలసి వచ్చేదేమీ లేదని 'జగన్‌' భావిస్తున్నారట. దీంతో ఖంగు తిన్న 'వివేకా' తాను పార్టీ మారే పరిస్థితి లేదని టిడిపిలోనే కొనసాగుతానని మాట మార్చారు. గవర్నర్‌ ద్వారా ఎమ్మెల్సీగా నామినేటెడ్‌ చేయాలని కొందరు మధ్యవర్తుల ద్వారా 'చంద్రబాబు'కు రాయభారం పంపారు. అటువంటి పరిస్థితే లేదని ఆయన తేల్చి చెప్పారు. దీంతో అటు జగన్‌ పార్టీలో చేరలేక..ఇష్టం ఉన్నా లేకున్నా, కష్టమైనా టిడిపిలోనే కొనసాగే పరిస్థితి 'వివేకా'కు వచ్చింది. ఈ విషయంలో తన సోదరుడు తొందరపడ్డారని మాజీ మంత్రి రాంనారాయణ పలువురు సన్నిహితులతో చెప్పి ఆవేదన వ్యక్తం చేశారట. అధికారం లేకుంటే ఆనం సోదరులు బతకలేరనే విమర్శను మళ్లీ 'వివేకా' రుజువు చేశారు.

(311)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ