WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కలెక్టర్లల్లోకెల్లా ఉత్తమ కలెక్టర్‌ 'కాటంనేని'...!

ఇటీవల వివిధ జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తున్న సందర్భంగా తనను కూడా బదిలీ చేయవల్సిందిగా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ 'కాటంనేని భాస్కర్‌' కోరగా దానికి ముఖ్యమంత్రి అంగీకరించలేదు. తరువాత బదిలీలపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇన్నేళ్ల నా రాజకీయ అనుభవంలో 'భాస్కర్‌' వంటి కలెక్టర్‌ను తాను చూడలేదని అతను కలెక్టర్లలో కెల్లా ఉత్తమ కలెక్టర్‌ అని ప్రశంల వర్షం కురిపించారట. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని సంవత్సరంలోపు పూర్తి చేయాలని తాను ఇచ్చిన హామీని కలెక్టర్‌ భాస్కర్‌ రాత్రింభవళ్లు పనిచేసి ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ముఖ్యకారకుడయ్యారు. ఆయన అధికార సర్వీసులో ఇంత వరకు లంచం తీసుకున్న దాఖలాలు లేవు. పోలవరం ప్రాజెక్టు నా హయాంలో పూర్తి అవాలంటే పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా భాస్కరే కొనసాగితేనే సాధ్యపడుతుందని ఆయన బదిలీ కోరినా చేసే ప్రసక్తేలేదని ఖరాఖండిగా చెప్పటం జరిగింది. 

   అధికార అవినీతిని తగ్గించడంలో బదిలీలు,పోస్టింగ్‌ల్లో పారదర్శకంగా వ్యవహరించిన ఏకైక కలెక్టర్‌ భాస్కరేనని ముఖ్యమంత్రి ఆసమావేశంలో కొనియాడారట. ఆ జిల్లా నుండి 'భాస్కర్‌'ను బదిలీ చేయించాలని అధికారపార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీమంత్రి, తాజాగా మంత్రి పదవి చేపట్టిన 'పీతాని' కూడా అవే ప్రయత్నాలు ప్రారంభించి చేతులు కాల్చుకున్నారు. 'మీకు మంత్రి పదవి ఇచ్చాను...జిల్లాలో కలెక్టర్‌గా...జాయింట్‌ కలెక్టర్‌గా ఎవరిని నియమించాలో నాకు తెలుసు..ఇప్పటి వరకు ఆ జిల్లాలో ప్రభుత్వానికి ఎంతో పేరు తెచ్చిన ఘనత అధికారయంత్రాంగానిదే. మీరు కూడా అదే బాటలో నడిచి ప్రభుత్వ ప్రతిష్టపెంచండి. అంతే కానీ మంత్రినన్న ధీమాతో ముందుకు వెళ్లకుండా ప్రజలకు అందుబాటులో ఉండండి..అని సలహా ఇవ్వటంతో 'పీతాని' మౌనంగా వెనుదిరిగి వచ్చారు. 'చంద్రబాబు' ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమపథకాల అమలులో మరియు వివిధ శాఖలకు కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చుచ చేయటంలో 'నరేగా' పనులు గ్రామాల్లో అమలు చేయటంలో 'పశ్చిమగోదావరి' జిల్లా ప్రథమ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి కొనియాడారు. అధికార సర్వీసులో అవినీతి మచ్చపడకుండా మేధావుల ప్రశంసలు అందుకున్న 'భాస్కర్‌'ను కూడా రాజకీయనాయకులతోపాటు ఉద్యోగసంఘాల నాయకులు అనేక ఇబ్బందులు పెట్టారు. ఆధారాలు లేని విమర్శలు చేసి చేతులు కాల్చుకున్నారు. సకాలంలో కార్యాలయానికి రండి...ప్రజలకు అందుబాటులో ఉండండి...సామాన్య ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దు...లంచాలు తీసుకోవద్దని చెబితే ఉద్యోగసంఘాలు నాయకులు విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. 

  తాజాగా ప్రభుత్వ కార్యాలయాలకు ర్యాంకింగ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఉత్తమ అధికారులకు పురష్కారాలను ఇవ్వబోతున్నారు. ప్రజలకు అందించే సేవలను మొదలకుని, కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు, అధికారులకు వసతుల కల్పన, పరిశుభ్రత తదితర అంశాలను ఆధారం చేసుకుని ర్యాంకింగ్‌ ఇవ్వబోతున్నారు. అక్కడి పరిస్థితులను అంచనా వేసేందుకు ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తారు. ఆయా తనీఖీలలో గుర్తించిన అంశాల ఆధారంగా కార్యాలయాలకు ర్యాంకింగ్‌లు ఇచ్చి వాటికి కారకులైన అధికారులకు పురష్కారాలు ఇవ్వబోతున్నారు కలెక్టరు భాస్కర్‌. జిల్లాలోని మండల స్థాయి నుండి డివిజన్‌ స్థాయి వరకు అధికారులు, ఉద్యోగులు కార్యాలయాలకు ఆలస్యంగా రావటం, మొక్కుబడిగా వచ్చి వెళ్లిపోతున్నారనే విమర్శలు రావడంతో ఆయా పరిస్థితులు మార్చేందుకు ర్యాంకింగ్‌ విధానాన్ని అమలులోకి తెస్తున్నారు కలెక్టర్‌. విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు తగిన వసతులు ఉన్నాయా...? కార్యాలయాలను శుభ్రంగా ఉంచుతున్నారా? అనే విషయాలపై ఉన్నతాధికారులు తనిఖీ చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఎవరెవరికి ఎన్నెన్ని మార్కులు వచ్చాయో ప్రకటించి మొదటి మూడు ర్యాంక్‌లో ఉన్న కార్యాలయాలకు, ఆ శాఖ ఉన్నతాధికారులకు స్వాతంత్య్రదినోత్సవ రోజున ప్రధానం చేయటమే కాకుండా ఐదువేల రూపాయల రివార్డు కూడా ఇవ్వబోతున్నారు. ఈ విధంగా ప్రజలకు దగ్గరవుతున్న జిల్లా మిగతా జిల్లాల కెల్లా ముందున్నదని తెలుసుకున్న కలెక్టర్‌ భాస్కర్‌కు పూర్తి అధికారాలు ఇస్తూ, పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యే విధంగా వ్యవహరించి ప్రభుత్వ ప్రతిష్టను, తన ప్రతిష్టను పెంచే బాధ్యతను 'భాస్కర్‌' భుజాలపై వేశారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఆయనకు చేదోడు వాదోడుగా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కోటేశ్వరరావు కూడా నిత్యం అందుబాటులో ఉంటున్నారు.


(767)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ