రాజకీయ జీవితంలో మచ్చలేని మా యువనేత,పంచాయితీరాజ్‌శాఖ మంత్రి లోకేష్‌పై ఆధారాలు లేని విమర్శలు చేసిన దొంగలపార్టీ నాయకుడైన వై.ఎస్.జగన్‌ను ప్రజలు శిక్షించడం ఖాయమని ఇప్పటికైనా ఆయన తన తీరును మార్చుకోకపోతే 2014 ఎన్నికల్లో ఓడించిన విధంగా మళ్లీ గుణపాఠం చెప్పడం ఖాయమని ఎమ్మెల్సీ సతీష్ ప్రభాకర్ హెచ్చరించారు. పథకం ప్రకారమే 'లోకేష్'పై 'జగన్'తో పాటు ఆయన పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని, సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకుంటూ అమానుషంగా వ్యవహరిస్తున్నారని, మా యువనేతను ఒక మాట అన్నా, విమర్శ చేసినా ఉపేక్షించమని 'అన్నం' ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతో పనిచేస్తూ కార్తకర్తల సంక్షేమనిధికి ముఖ్యకారుకుడైన మా యువనేతను విమర్శించే అర్హత దొంగలపార్టీ నాయకులెవరికీ లేదని 'అన్నం' దుయ్యబట్టారు. 'లోకేష్'పై కట్టుకథలు ప్రచారం చేయటమే పనిగా పెట్టుకున్నారని, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ప్రజలు నమ్మరని 'అన్నం' ధీమా వ్యక్తం చేశారు.
దొంగలపార్టీ నేతతో పాటు ఆయన అనుచరులు కూడా పనిగట్టుకుని నిందలు వేయటం, ఆయన వ్యక్తిగత పరువుకు భంగం కల్గించడం చూస్తుంటే అధికార దాహంతో వీరు పరితపిస్తున్నారని అభద్రతాభావంతో ఆ పార్టీ నేతలు ఉన్నట్లు స్పష్టం అవుతుందని 'సతీష్' అన్నారు. లోకేష్ వంటి సమర్థుడైన నేత తెలుగుదేశం పార్టీలో ఉండడం జీర్ణించుకోలేక 'జగన్'తో పాటు ఆయన పార్టీ నాయకులు అసూయతో అవాస్తవ విమర్శలు, ఆరోపణలు చేస్తే ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని ఇప్పటికైనా విమర్శలు, ఆరోపణలు మానుకొని ప్రతిపక్షనేత ప్రజా సమస్యల పరిష్కారం కోసం సూచనలు ఇస్తే మంచిపేరు తెచ్చుకుంటారని లేకుంటే ఆయనకు అథమపాతం తప్పదని అన్నం హెచ్చరించారు. పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుదని వేల కోట్లు అవినీతికి పాల్పడి అక్రమంగా సంపాదించిన 'జగన్'కు మా యువనేత లోకేష్‌ను విమర్శించే అర్హత ఉందా..? రాజకీయ రంగానికే మాయని మచ్చగా దొంగలపార్టీ అధినేతగా కొనసాగుతున్న 'జగన్'ను ఆయన పార్టీలో ఉన్న అవినీతి తిమింగలాలను ప్రజలు శిక్షించడం ఖాయమని 'అన్నం' జోస్యం చెప్పారు. క్రిడ్‌ప్రోకో వంటి నేరాలు పక్కాగా అమలు చేసి వేల కోట్లు రూపాయలు అక్రమంగా కూడబెట్టిన 'జగన్' తప్పులను పక్కనపెట్టి లోకేష్ ప్రసంగించే టప్పుడు వాడిన మాటలను భూతద్దంలో చూపించిన ఘనత 'జగన్'కే దక్కిందని ఆయన చెప్పారు. గతంలో అనేక మంది ప్రముఖులు అనేక సందర్భాల్లో బహిరంగ వేదికలపై ప్రసంగించేటప్పుడు కొన్ని తప్పులు దొర్లాయాని, ఆయన తండ్రి కీ.శే.వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రసంగించిన విషయం 'జగన్' మరిచిపోయారా...? కాబోయే ముఖ్యమంత్రిని నేను..జాగ్రత్త అని అధికారులను బెదిరించిన చరిత్ర 'జగన్'కే ఉందని...లోకేష్ ఇటువంటి చరిత్ర లేదని 'అన్నం' చెప్పారు.
క్షమించాలి మీరు వార్త మీద ఇష్టం లేదా వ్యతిరేకత ఇవ్వాలంటే మీరు లాగిన్ అయి ఉండవలెను .
LOGIN
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే ఇష్టపడి ఉన్నారు
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే వ్యతిరేకించి ఉన్నారు
అభిప్రాయాలూ