WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పొగాకు బోర్డులో రూ. 30 కోట్ల అవినీతి

గుంటూరుమే 5:: పొగాకు బోర్డులో ఏపీ, కర్ణాటక అధికారులు రూ. 30 కోట్ల మేరకు అవినీతికి పాల్పడ్డారని బోర్డు డైరెక్టర్ బి. సీతయ్య పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పొగాకు బోర్డుకు రెండేళ్లుగా చైర్మన్, ఈడీ లేకపోవడంతో వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారన్నారు. ఈవిషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. అలాగే పొగాకు బోర్డులో ఖాళీగా ఉన్న కీలక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీతయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

(252)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ