WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నిర్భయకేసులోనిందితులకుఉరిశిక్ష

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిర్భయ పట్ల అమానుషంగా వ్యవహరించిన వారికి ఉరే సరైందని తేల్చింది. ఈ కేసులో కిందికోర్టులు ఇచ్చిన మరణశిక్ష తీర్పునే సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. 2012 డిసెంబర్‌ 12న దేశ రాజధాని దిల్లీలో కదిలే బస్సులో 23 ఏళ్ల యువతిపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరణశిక్షను సవాల్‌ చేస్తూ నలుగురు దోషులు ముఖేశ్‌, వినయ్‌, అక్షయ్‌, పవన్‌లు చేసుకున్న అప్పీళ్లను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. వైద్య విద్యార్థిని నిర్భయపై కిరాతకంగా వ్యవహరించిన ఆరుగురిలో ఒకరు శిక్ష అనుభవిస్తూ జైలులోనే ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్‌ కావడంతో బయటకు వచ్చాడు. మిగిలిన నలుగురురికి మరణశిక్షను విధిస్తూ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ భానుమతి, జస్టిస్‌ అశోక్‌భూషణ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.

దేశ రాజధాని నడివీధుల్లో 23 సంవత్సరాల వైద్య విద్యార్థిని బస్సులో తిప్పుతూ దారుణాతి దారుణంగా అత్యాచారం చేసి, ఆమె మరణానికి కారకులైన నలుగురు నిందితులకు నాలుగేళ్ల తరువాత నేడు శిక్ష ఖరారు కానుంది. భారతావనిలో పెను సంచలనం సృష్టించి, ఆపై జాతి యావత్తూ కదలగా, 'నిర్భయ' చట్టం ఆవిష్కరణకు నాంది పలికిన ఈ కేసులో సుప్రీంకోర్టు తన తుది తీర్పును వెలువరించనుంది.
డిసెంబర్ 16, 2012న అక్షయ్ థాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్ లు బస్సులో ఓ యువతిని నిర్బంధించి గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో ట్రయల్ కోర్టు 2013లో మరణశిక్ష విధించగా, నిందితుల పిటిషన్ మేరకు సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపిన సంగతి తెలిసిందే. కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉండగా, రామ్ సింగ్, తీహార్ జైల్లో మార్చి 2013లో ఉరివేసుకుని మరణించిన సంగతితెలిసిందే.మరో నిందితుడు నేరం చేసే సమయానికి మైనర్ కావడంతో, మూడేళ్ల శిక్షాకాలం తరువాత డిసెంబర్ 2015లో విడుదలయ్యాడు. నిర్బయ కేసు వెలుగులోకి వచ్చిన తరువాతనే, తీవ్రమైన నేరాల విషయంలో బాలనేరస్తుల వయసును 18 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలకు తగ్గిస్తూ కూడా చట్టంలో మార్పులు తీసుకువచ్చారు. ఇక ఈ కేసులో జస్టిస్ దీపక్ మిశ్రా, ఆర్.భానుమతిలతో కూడిన ధర్మాసనం నేడు తుది తీర్పును ఇవ్వనుంది.

తమ కుమార్తెపై అత్యంత పాశవికంగా వ్యవహరించి బలితీసుకున్న కిరాతకులకు ఉరిశిక్షను ఖరారుచేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించగానే.. నిర్భయ తల్లిదండ్రులు కోర్టులోచప్పట్లు కొట్టి హర్షం ప్రకటించారు. ఈ తీర్పుతో తమకు న్యాయం జరిగిందన్నారు. న్యాయవాదులు సైతం హర్షం వ్యక్తంచేశారు. తన బిడ్డపై అత్యంత దారుణంగా ప్రవర్తించిన నలుగురు దుర్మార్గులకూ ఉరిశిక్షే సరైనదని నిర్భయ తల్లి ఆశాదేవీ వ్యాఖ్యానించారు. వారిని ఉరి తెసినప్పుడే మరణించిన తన బిడ్డ ఆత్మకు శాంతి కలుగుతుందని ఆశాదేవి అభిప్రాయపడ్డారు.అంతకన్నా శిక్ష తగ్గితే, కామాంధులు మరింతగా రెచ్చిపోతారని, మరింత మంది నిర్భయలు బలవుతారని అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు పరిస్తేనే తమ కుటుంబానికి ఊరట, తనకు మనశ్శాంతి లభిస్తాయని తెలిపారు.  

(368)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ