WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పది రోజుల్లో వెయ్యి కోట్లు...!

తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. కేవలం పదంటే పది రోజుల్లో వెయ్యి కోట్ల రూపాయలను వసూలు చేసి భారతీయ సినిమా రికార్డులను చెరిపివేసింది. గతంలో ఏ భారతీయ సినిమా కూడా ఈ రకమైన వసూళ్ల సాధించలేదు. నెలలు,సంవత్సరాల తరబడిన ఆడిన సినిమాలు భారతీయ సినీ పరిశ్రమలో ఎన్నో ఉన్నా ఏ సినిమా కూడా దీని దరిదాపులోకి వచ్చే పరిస్థితి లేదు. నిన్న మొన్నటి దాకా హిందీ సినిమా పీకే రూ.700కోట్లు సాధిస్తే అబ్బో అని చంకలు గుద్దుకున్న హిందీ సినీ పరిశ్రమ 'బాహుబలి' దెబ్బకు గింగరాలు తిరుగుతోంది.    ఖాన్‌లు, బచ్చన్‌లు, చోప్రాలు ఎవరికీ సాధ్యం కాని రీతిలో 'బాహుబలి' రికార్డులు సృష్టిస్తూ సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే వెయ్యి కోట్లు వసూళ్లు సాధించిన 'బాహుబలి' పూర్తి రన్‌లో మరో ఐదువందల కోట్లు సాధిస్తుందని సినీపరిశ్రమ వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద పదిహేను వందల కోట్లు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో కూర్చుకుంది.  


(376)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ