WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఒకే ఒక్కడు అనగాని

దశాబ్థంన్నర క్రితం విడుదలైన తెలుగు చలనచిత్రంలో హీరో పాత్రదారి ప్రభుత్వ పగ్గాలను చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్థిపథంలో హైటెక్‌ హంగులతో నడిపించిన విధంగా, అదే బాటలో రేపల్లె శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్‌ పయనిస్తూ ఎన్నికైన నాటి నుండే నియోజకవర్గ అభివృద్థిపై ప్రత్యేక దృష్టిని సారించారు.ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పేదవారి ముంగిట పరచబడాలని,గ్రామాభ్యుదయమే మండలాభ్యుదయమని మండలాభ్యుదయమే నియోజకవర్గ అభివృద్థి అని,ఇందుకు ప్రజలందరి భాగస్వామ్యం కావాలని కోరుకున్న ఒకే ఒక్కడు సత్యప్రసాద్‌.నియోజకవర్గంలోని ఒకొక్కరు ప్రతి ఒక్కరూ కర్తవ్య నిర్వహణతో అభివృద్థి కార్యక్రమాలకు ప్రత్యక్ష నిదర్శనంగా దర్పనం కావాలని అభిలేషించారు.కృషి ఉంటే మనుషులు రుషులవుతారు,మహాపురుషులవుతారు అన్న రీతిలో ముఖ్యంగా రహదారుల అభివృద్థిని చేపట్టారు.నియోజకవర్గంలో పెనుమూడి, లంకేవానిదిబ్బ రహదారి,రేపల్లె,పిట్టలవారిపాలెం రహదారి,రేపల్లె నిజాంపట్నం రహదారి, రేపల్లె,కనగాల రహదారి,నగరం,చెరుకుపల్లి రహదారి మార్గాలను నాలుగు లైన్ల రోడ్లుగా విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు.

అలాగే నగరం మండలం మంత్రిపాలెం నుండి హారీస్‌పేట వరకు గల రహదారిని రెండు లైన్ల రహదారిగా రూ.15కోట్లతో విస్తరణ కార్యక్రమానికి నాంది పలికారు.రహదారి మార్గాల ప్రక్కన ఆక్రమణలు కూడా తొలగించటంతో రహదారులు పూర్తికాకపోయినప్పటికి సినిమాల్లో వలే తలపిస్తున్నాయనటంలో ఏమాత్రం సందేహం లేదని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు.అదే విధంగా ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిథుల నుండి రూ.22కోట్ల వ్యయంతో రేపల్లె పట్టణంలో వెడల్పయిన రహదారుల నిర్మాణం చేపట్టి పట్టణ ప్రజల ఆదరణను చూరగొన్న ఒకే ఒక్కడు సత్యప్రసాద్‌గా విశేష ఆదరణను అందుకుంటున్నారు.ఇంకా నియోజకవర్గంలోని మండలాల్లో కూడా అభివృద్థికార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయి.నగరం గ్రామంలో రూ.9కోట్ల వ్యయంతో అంతర్గత రహదారులు,మురుగు కాల్వల నిర్మాణం త్వరలోనే చేపట్టనున్నారు.అలాగే నిజాంపట్నం హార్బర్‌ అభివృద్థికి కృషి చేయటం,దిండి సముద్ర తీరప్రాంతాన్ని బీచ్‌గా అభివృద్థిపర్చటం,పెనుమూడి నుండి లంకేవానిదిబ్బ వరకు గల కృష్ణాతీరప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్థిపర్చటం,నిజాంపట్నం మండలంలో పారిశ్రామిక ఓడ ఏర్పాటు ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన కోసం ప్రయత్నం చేయటం.పట్టణంలో ఇండోర్‌ ఆడిటోరియం నిర్మాణం,చిన్న పిల్లలు ఆడుకోవటానికి స్విమ్మింగ్‌పూల్‌తో పాటు పార్కు సౌకర్యం కల్పించటం, యువతకోసం స్టేడియం నిర్మాణంచేపట్టటం,పట్టణంలోని బస్టాండ్‌ ప్రాంతం నుండి గుడ్డికాయలంక వంతెన వరకు 100అడుగుల వెడల్పు గల సిమెంట్‌ రహదారిని నిర్మాణం చేయటం,గ్రామగ్రామాలలో  అంతర్గత రహదారులను సీసీ రోడ్లుగా అభివృద్థిపరచటం లాంటి కార్యక్రమాలు ప్రస్తుతం చేపట్టేందుకు నిథులు రాబడుతున్నట్లు సత్యప్రసాద్‌ తెలిపారు.మొత్తానికి నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరానికి ధీటుగా రేపల్లె నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలన్న కృతనిశ్చయంతో సత్యప్రసాద్‌ ఉన్నారన్నది యదార్థం.

అయితే స్థానిక వైకాపా నేతలు అభివృద్థి పనులను చూసి ఓర్వలేక,లేనిపోని కట్టుకథలను కల్పిస్తూ,అసత్య ప్రచారాలకు పాల్పడుతూ నియోజకవర్గ అభివృద్థి దీక్షకు భగ్నం కలిగే విధంగా చేస్తున్న ప్రయత్నాలను ఏమాత్రం లెక్కచెయ్యనని,ప్రజలకు సేవ చేసేందుకే తాను తన పెదనాన్న అనగాని భగవంతరావు రాజకీయ వారసుడుగా రాజకీయ రంగ ప్రవేశం చేశానని,మడమతిప్పేది లేదని,అందుకు ప్రజల ఆశీర్వాదాలు తనకు అవసరమని  అనగాని సత్యప్రసాద్‌ స్పష్టం చేశారు.ఏదిఏమైనప్పటికి  గతం కన్నా మిన్నగా నియోజకవర్గ అభివృద్థి జరుగుతోందన్నది ప్రజల అభిప్రాయం.


(2377)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ