WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

విద్యార్థినులకు ఇబ్బందిగా మారిన ‘డ్రెస్’ కోడ్

ఇటీవల కాలంలో దేశంలో నిర్వహిస్తున్న పలు పరీక్షలు నిజంగా అభ్యర్థులకు పరీక్ష పెడుతున్నాయి. పరీక్షల సందర్భంగా విధిస్తున్న నిబంధనలు వారిని తెగ ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష (నీట్)కు హాజరైన విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థినులు అధికారుల ‘డ్రెస్ కోడ్’తోతీవ్రఇబ్బందులుపడ్డారు. కేరళలోని కన్నూరులో పరీక్షా కేంద్రానికి వెళ్లిన ఓ విద్యార్థిని బ్రా ధరించడంతో పరీక్ష రాసేందుకు అడ్డు చెప్పారు. దానిని తొలగించి వస్తేనే పరీక్ష రాసేందుకు అనుమతిస్తామని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది. చేసేది లేక దానిని తొలగించి బయట ఉన్న తల్లి చేతిలో పెట్టి పరీక్షకు హాజరైంది. పరీక్ష హాలు నుంచి బయటకు వచ్చిన కుమార్తె తన చేతిలో టాప్ ఇన్నర్ వేర్ పెట్టి మళ్లీ వేగంగా లోపలికి వెళ్లిపోయిందని విద్యార్థినితల్లిఆవేదనవ్యక్తంచేసింది. పరీక్ష పూర్తయిన అనంతరం విద్యార్థిని ఈ విషయాన్ని మీడియాకు తెలియజేసింది. ‘నీట్’లో డ్రెస్ కోడ్ విధించడంతో దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరీ ఇంత విచిత్రమైన నిబంధనలు... అమ్మాయిలను అవమానించేలాంటి నిబంధనలు అవసరమా అన్న చర్చ మొదలైంది.

(135)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ