WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సెక్స్ కోసం ఖైదీల ఉద్యమం

జైళ్లలో ఖైదీలు అప్పుడప్పుడు తమను వేధిస్తున్నారనో.. సరైన తిండి పెట్టడం లేదనో విడుదల చేయాలనో.. నిరసన తెలుపుతుంటారు. కానీ బ్రిటన్ లోని ఓ ఖైదీ మాత్రం జైల్లో ఉన్న తమకు పడక సుఖం లేదని.. తమకు సెక్సు డాల్స్ ఇస్తే ఎంజాయ్ చేస్తామని అంటున్నారు. దీనికోసం ఆయన ఏకంగా జైలు వెబ్ సైట్ వేదికగా 'ఖైదీలకు సెక్స్ డాల్స్ కావాల'ని ప్రచారం చేపట్టాడు. కాగా ఈ డిమాండ్ కు బయటి నుంచి పెద్ద ఎత్తున సంఘీభావం వ్యక్తమవుతోంది. నాటింగ్ హామ్ షైర్ లోని లోథమ్ గ్రేగ్ జైలులో ఖైదీగా ఉన్న జాక్ స్వారేజ్ చాలాకాలంగా శిక్ష అనుభవిస్తున్నాడు. దీంతో ఆయన అక్కడి ఖైదీల మానసిక స్థితిపై అధ్యయనం చేసి సమాజం ఆశించిన మేరకు ఖైదీలలో పరివర్తన రావాలంటే తరచూ శృంగార కార్యకలాపాలకు అనుమతించాల్సిందేనని వాదిస్తున్నాడు. అందుకే ఖైదీలు సెక్స్ డాల్స్ ను వినియోగించుకునేలా చట్టాలు సవరించాలని డిమాండ్ చేస్తున్నాడు.ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పైసా ఖర్చుపెట్టాల్సిన అవసరం ఉండదని ఖైదీల సొంత డబ్బుతోనే రబ్బరు బొమ్మల్ని కొనుక్కునే వీలు కల్పించాలని కోరుతున్నాడు. ఈ మేరకు జైలు వైబ్ సైట్ పేజీలో తన వాదనను వినిపించిన జాక్ ను ప్రఖ్యాత బీబీసీ సహా పలు అంతర్జాతీయ చానెళ్లు ఇంటర్వ్యూ చేశాయి. ఆయా ఇంటర్వ్యూలు చూసిన చదివినవారిలో అత్యధికులు జాక్ వాదనతో ఏకీభవించడం గమనార్హం.

(627)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ