WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పాక్ ఫై భార‌త ఆర్మీ ప్ర‌తీకార దాడి

న్యూఢిల్లీ మే 8:: భార‌త ఆర్మీ ప్ర‌తీకార దాడి చేసింది. నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద ఉన్న పాకిస్థాన్ బంక‌ర్‌ను పేల్చేసింది. జ‌మ్మూక‌శ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉన్న కృష్ణ‌ఘాటీ సెక్టార్ ద‌గ్గ‌ర ఈ దాడి జ‌రిగింది.   పాకిస్థాన్ బ‌ల‌గాలు ఇటీవ‌ల ఇద్ద‌రు భార‌త జ‌వాన్ల‌ను అత్యంత హేయంగా చంపేసిన విష‌యం తెలిసిందే. ఆ ఘ‌ట‌న‌కు ప్ర‌తీకారంగానే భార‌త ద‌ళాలు పాక్ స్థావ‌రాల‌పై దాడులు చేసిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఇద్ద‌రు భార‌త జ‌వాన్ల హ‌త్యకు ప్ర‌తీకారంగా దాడులు చేస్తామ‌ని ఇటీవ‌ల ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ స్ప‌ష్టం చేశారు. ఆర్మీ ఎప్పుడూ భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు వెల్ల‌డించ‌దు అని, ప్ర‌ణాళిక‌లు అమ‌లు అయ్యాకే చెబుతుంద‌ని ఆయ‌న తెలిపారు. నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద జ‌వాన్లు న‌యిబ్ సుబెదార్ ప‌ర‌మ్‌జిత్ సింగ్‌, ప్రేమ్ సాగ‌ర్‌లను పాక్ రేంజ‌ర్లు కిరాత‌కంగా చంపిన విషయం తెలిసిందే.

(319)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ