WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అత్యవసర వాహనాలకు ఎర్ర బుగ్గల అనుమతి

న్యూఢిల్లీ మే 8:: దేశంలో వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడుతూ ఎవరూ ఎర్రబుగ్గలు వాడొద్దని గతంలో తీసుకున్న నిర్ణయంలో కేం ద్ర క్యాబినెట్ స్వల్ప మా ర్పులు చేసింది. పోలీసులు, భద్రతాదళాల వాహనాలకు, శాంతి భద్రతలను అదుపు చేసేందుకు, అగ్ని ప్రమాదాలు, విపత్తులు వంటి అత్యవసర సమయాల్లో వినియోగించే వాహనాలకు మినహాయింపునిచ్చింది. ఈ వాహనాలపై తెలుపు, ఎరుపు, నీలం రంగులతో కూడిన బుగ్గలను వాడవచ్చునని చెప్పింది. ఈ మేరకు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అధికారికంగా విధులు నిర్వహిస్తున్నప్పుడు మాత్రమే వీటిని వాడాల్సి ఉం టుంది. ఆయా వాహనాలకు రవాణాశాఖ ఒక ప్రత్యేకమైన స్టిక్కర్ విడుదల చేస్తుంది. ఇందులో అధికారి పేరు, హోదా తదితర వివరాలు ఉంటాయి. వాటిని వాహనం కిటికీ అద్దంపై అంటించాల్సి ఉంటుంది. ఒక్కో అధికారికి ఒక స్టిక్కర్‌ను మాత్రమే కేటాయిస్తారు.

(317)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ