WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జబర్ధస్త్‌' 'వినోదిని' ఆత్మహత్యాయత్నం...!

ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో 'జబర్దస్త్‌' నటుడు వినోద్‌ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. బుల్లితెరపై నెంబర్‌వన్‌ షోగా గుర్తింపు తెచ్చుకున్న 'జబర్దస్త్‌' ప్రోగ్రామ్‌లో లేడీ గెటప్‌లు వేసి 'వినోద్‌' పేరు తెచ్చుకుంటున్నాడు. 'వినోద్‌' మహిళల పాత్రల్లో మెరుస్తూ స్కిట్‌లను హిట్‌ చేయటంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. అటువంటి నటుడు ఈ రోజు తల్లిదండ్రులతో గొడవపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలుస్తోంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే బాధతో అతను చేతికి గాయం చేసుకుని ఆత్మహత్య చేసుకోబోయాడని పోలీసులు తెలుపుతున్నారు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకపోవడంతోనే అతను ఈ విధంగా వ్యవహరించాడని పోలీసులు అంటున్నారు.  కాగా 'వినోద్‌' పెళ్లిని పోలీసులు ఆపివేసి కేసు నమోదు చేసుకుని అతని వాంగ్మూలం తీసుకున్నారు. తనకు అసలు పెళ్లంటే ఇష్టం లేదని అతను చెబుతున్నా తల్లిదండ్రులు బలవంతం చేయటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


(1916)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ