WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పోలవరాన్ని త్వరగా పూర్తి చేస్తాం...!

పోలవరం- సోమవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులను రాష్ర్ట జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు జాప్యం జరగకుండా త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను, నిర్మాణ ఏజెన్సీలను ఆదేశించారు. వేసవి కాలంలో ఈ సీజనల్ 669 మీటర్ల డయాఫ్రమ్ వాల్ పనులు గోదవరి వరద వచ్చే సమయానికి పూర్తి చేస్తామన్నారు. ఇప్పటి వరకు డయాఫ్రమ్ నిర్మాణం పనులు 206 మీటర్ల పూర్తి అయ్యిందని మంత్రి అన్నారు. 149 పేనల్స్ లో 39 పేనల్స్ త్వరితగతిన పూర్తి చేసామన్నారు. కాపర్ డామ్ డిజైన్స్ వారం రోజుల్లో వస్తాయని, వచ్చిన వెంటనే నిర్మాణం పనులు ప్రారంభిస్తామన్నారు. 

  3.6కోట్లు ఎర్త్ వర్క ఉంది ఇది కూడా త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు పనుల పనితీరుని పరిశీలించి, సమీక్ష నిర్వహించి, ప్రాజెక్టు పనులు ఎంత వరకు వచ్చాయో తెలపాలని ఆదేశించారన్నారు. ముఖ్యమంత్రి గారి పర్యటన వచ్చే వారం రోజుల్లో ఉండవచ్చన్నారు. నవంబర్ నెలలో స్పిల్ వే ప్రాంతం గేలరీవాక్ గా గేలరీలో నడవాలని ముఖ్యమంత్రి వారి ఆలోచన అని అన్నారు. 32బ్లాకుల్లో కాంక్రీట్ పనులు చేసేందుకు మెటీరియల్ ఉందని, త్వరలో పనులు ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఒక ప్రణాళిక బద్దంగా వేగవంతం చేసేందుకు అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. డయాఫ్రమ్ వాల్, స్పిల్ వే, గేట్లు ఫేబికేషన్ ఏరియాను మంత్రి ఉమామహేశ్వరరావు పరిశీలించారు.

(456)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ