WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మంత్రి నారాయణ కుమారుడు మృతి

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ సహా అతడి స్నేహితుడు రాజా రవివర్మ మరణించాడు. నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లో ఈ ప్రమాదం జరిగింది. మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న బెంజ్ కారు వేగంగా వచ్చి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. కారు ఎయిర్‌ బ్యాగులు తెరుచుకున్నప్పటికి ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అపోలో ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచినట్లు జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.వెంకట్‌రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా కారును తరలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఉస్మానియాకు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. నారాయణ కుమారుడు నిషిత్ ప్రస్తుతం నారాయణ విద్యాసంస్థలకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.


(2855)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ