WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'దేవేందర్‌గౌడ్‌'కు 'చంద్రబాబు' పరామర్శ....!

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో నెంబర్‌ టూగా ఉండి ప్రస్తుతం ఉనికిలో లేకుండా పోయిన టిడిపి రాజ్యసభ సభ్యుడు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన టిడిపిలో ఉన్నా క్రియాశీలకంగా లేరు. తీవ్రమైన అనారోగ్యమైన కారణాలతో అమెరికాలో చికిత్స పొందుతున్నారు. 'దేవేందర్‌గౌడ్‌' అమెరికాలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ రోజు అమెరికాలో ఆయనను పరామర్శించారు. క్యానర్‌తో బాధపడుతున్న 'దేవేందర్‌గౌడ్‌' రాచెస్టర్‌ నగరంలో మేయో క్లీనిక్‌లో చికిత్స తీసుకుంటున్న ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు కలసి ఆరోగ్య పరిస్థితిపై చర్చించారు. తరువాత రాజకీయాల గురించి, ఆయనకు అందుతున్న చికిత్స గురించి 'దేవందర్‌'తో చంద్రబాబు మాట్లాడారు. మొత్తం మీద తమ పార్టీ సీనియర్‌నేత అయిన 'దేవందర్‌గౌడ్‌'ను గుర్తుంచుకుని 'బాబు' పరామర్శించడం టిడిపి నేతలకు ఆనందాన్ని ఇచ్చింది.

(4371)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ