సోనియా, రాహుల్ లకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సోనియా, రాహుల్ లకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. నేషనల్ హెరాల్డ్ కేసులో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై దర్యాప్తు జరిపేందుకు ఆదాయపు పన్ను శాఖకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. పంతం పట్టవద్దని, యంగ్ ఇండియా తప్పనిసరిగా ఆదాయపు పన్ను డాక్యుమెంట్లను సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ కంపెనీకి ఇరువురు నేతలు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. అసోసియేట్ జ‌ర్న‌ల్స్ లిమిటెడ్ నుంచి రూ.90 కోట్ల విలువైన ఆస్తుల‌ను కేవలం రూ.50 ల‌క్ష‌లు చెల్లించి సోనియా, రాహుల్‌గాంధీలు యంగిండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు క‌ట్ట‌బెట్టార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ కేసులో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు ఆస్కార్ ఫెర్నాండెజ్‌, సుమ‌న్ దూబెతోపాటు శామ్ పిత్రోడా కూడా నిందితులుగా ఉన్నారు. బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి 2012 లో పాటియాలా హౌస్ కోర్టులో ప్రైవేట్ క్రిమినల్ కంప్లయింట్‌ దాఖలు చేశారు. 

   సోనియా, రాహుల్‌లతో పాటు మరికొందరు యంగ్ ఇండియా ద్వారా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపించారు. రూ.2000 కోట్ల కన్నా ఎక్కువ విలువైన అసోసియేటెడ్ జర్నల్స్‌ను సొంతం చేసుకునేందుకు యంగ్ ఇండియా ద్వారా కేవలం రూ.50 లక్షలు చెల్లించారని ఆరోపించారు. యంగ్ ఇండియాలో సోనియా, రాహుల్‌లకు వాటాలు ఉన్నాయని, అసోసియేటెడ్ జర్నల్స్ నేషనల్ హెరాల్డ్’ను ప్రచురిస్తోందని తెలిపారు. ఈ ఆరోపణలపై దర్యాప్తుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు.ఇందులో 2015, డిసెంబ‌ర్‌లోనే సోనియా, రాహుల్‌ల‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బీజేపీ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఈ కేసు వేశారు. గ‌తంలో ప‌టియాలా హౌజ్ కోర్టు కూడా సోనియా, రాహుల్‌ల‌పై ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ విచార‌ణ‌కు ఆదేశించినా.. దానిని ఢిల్లీ హైకోర్టులో స‌వాలు చేశారు. కానీ అక్క‌డ కూడా ఈ ఇద్ద‌రు నేత‌ల‌కు ఊర‌ట ల‌భించ‌లేదు. హైకోర్టు తీర్పుపై సోనియా, రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి 2012లో పాటియాలా హౌస్ కోర్టులో ప్రైవేట్ క్రిమినల్ కంప్లయింట్‌ దాఖలు చేశారు. సోనియా, రాహుల్‌లతో పాటు మరికొందరు యంగ్ ఇండియా ద్వారా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలపై దర్యాప్తుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు.

(287)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ