WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎన్‌కౌంట‌ర్ లో 20మంది మావోయిస్టుల మృతి....!

బీజాపూర్‌లో జరిగిన భీకర ఎన్‌కౌంటర్లో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సుమారు 350 మంది పారామిలిటరీ జవాన్లు పాల్గొన్న అత్యంత కీలక ఆపరేషన్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగిందని సీఆర్‌పీఎఫ్ ఐజీ మంగళవారం తెలిపారు. ఈ ఎన్‌‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టులు మరణించినట్లు పేర్కొన్నారు. సీఆర్‌పీఎఫ్‌లోని కోబ్రా యూనిట్ సిబ్బంది ధరించే యూనిఫారాలను నక్సలైట్లు ధరిస్తున్నట్లు తాము ఈ సంఘటనలోనే తెలుసుకున్నామని వివరించారు. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లో విస్తరించిన రెడ్ జోన్ నుంచి నక్సలైట్లను తుడిచిపెట్టేందుకు పారా మిలిటరీ దళాలు నిర్వహించిన అత్యంత భారీ ఆపరేషన్ ఇదే కావడం గమనార్హం.




(224)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ