WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

త్వరలో అమెరికాకు 'కెసిఆర్‌'...!

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలో అమెరికాకు వెళుతున్నారని అత్యంత విశ్వసనీయవర్గాలు తెలియజేశాయి. అనారోగ్యంతో సతమతమవుతున్న ఆయనకు చికిత్స అందించేందుకు మరికొద్ది రోజుల్లో వెళ్లనున్నారని ఆ వర్గాలు తెలిపాయి. ఇటీవల ఢిల్లీలో 'కెసిఆర్‌' కంటికి శస్త్రచికిత్స నిర్వహించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆయనకు శస్త్రచికిత్స జరిగిందా లేదా...? అనేది బయటకు తెలియటం లేదు. అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఆయనకు చికిత్స నిర్వహించలేదని, బీపీ, సుగర్‌ కంట్రోల్‌లోకి రాకపోవడంతో శస్త్రచికిత్సను వాయిదావేశారని తెలుస్తోంది. దీనితో పాటు లివర్‌ సమస్య కూడా వేధిస్తుండడంతో ఆయనకు మెరుగైన చికిత్స అందించేందుకు అమెరికాకు తీసుకువెళ్లాలని ఆయన కుటుంబసభ్యులు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. దీనిలో భాగంగా కెసిఆర్‌ కుమారుడు కెటిఆర్‌ నిన్న అమెరికా పర్యటనకు వెళ్లారట. అయితే ఆయన పర్యటనపై ఎవరూ పెదవి విప్పడం లేదు. సాధారణంగా వెళ్లినట్లు చెబుతున్నా...ఆయన వెళ్లింది మాత్రం కెసిఆర్‌కు చికిత్స అందించేందుకు అని ఆ వర్గాలు తెలిపాయి. 20 రోజుల పాటు కెసిఆర్‌కు అమెరికాలో చికిత్స అందిస్తారని సదరు వర్గాలు అంటున్నాయి.

(375)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ