WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

‘ఏ1’ కేటగిరీలోదక్షణ మద్య రైల్వే

దేశంలోని రైల్వేస్టేషన్లలో స్వచ్ఛతా ప్రమాణాలు పాటిస్తున్న రైల్వే స్టేషన్ల ర్యాంకుల జాబితాను కేంద్ర రైల్వే శాఖా మంత్రి సురేశ్‌ప్రభు వెల్లడించారు. స్వచ్ఛరైల్వేస్టేషన్ల ర్యాంకుల్లో ‘ఏ1’ కేటగిరీలో విశాఖపట్నం, సికింద్రాబాద్‌, జమ్ముతావి రైల్వేస్టేషన్లు చోటు దక్కించుకున్నాయి. ‘ఎ’ కేటగిరిలో బియాస్‌, ఖమ్మం, అహ్మద్‌నగర్‌ రైల్వేస్టేషన్లు నిలిచాయి. ఇక జోనల్‌ రైల్వేల్లో దక్షిణమధ్య రైల్వేకు తొలిస్థానం దక్కింది. రెండో స్థానంలో ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే, మూడో స్థానంలో మధ్య రైల్వే నిలిచాయి. ఈ కార్యక్రమంలో రైల్వేమంత్రి స్వచ్ఛపోర్టల్‌ను ప్రారంభించారు. రైల్వేస్టేషన్లు, ప్లాట్‌ఫాంలే కాకుండా ఇకపై రైళ్లకు కూడా ర్యాంకింగులు ఇవ్వబోతున్నట్లు ఆయన ప్రకటించారు. పోర్టల్‌ ద్వారా యాత్రికులు తమ సూచనలు, సలహాలు ఇవ్వొచ్చని ఆయన తెలిపారు.దేశవ్యాప్తంగా 407 రైల్వే స్టేషన్లలో ఐఆర్సీటీసీ, క్యాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా విడివిడిగా ఈ సర్వే నిర్వహించాయి.

(125)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ