అణ్వాయుధాల నిల్వ కోసం పాకిస్థాన్ రహస్యంగా నిర్మిస్తున్న స్థావరం వివరాలు బయటపడ్డా స్థావరం యి. ఖైబర్ కనుమల్లోని హరిపూర్ పీర్‌థాన్ పర్వత శ్రేణుల్లో దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు బాహ్యప్రపంచానికి దీనికి గురించి తెలియకుండా పాక్ జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. ఉపగ్రహ చిత్రాలను సైనిక నిఘా సంస్థలు విశ్లేషించడంతో ఈ విషయం బయటపడింది.ఈ ప్రాంతంలో పాక్‌కు చెందిన షాహిన్-3 క్షిపణులను మోహరించింది. ఈ క్షిపణులకు 2750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సత్తా ఉంది. దీని సాయంతో భారత్‌లోని అండమాన్ దీవులపై కూడా దాడి చేయవచ్చు. అణ్వాయుధ సామర్థ్య క్షిపణులను రహస్యంగా మోహరించడం అంటే దానిని భారత్‌కు ముప్పుగా భావించాల్సిందే.
ఈ స్థావరం అమృత్‌సర్‌కు 320 కిలోమీటర్లు, ఛండీగఢ్‌కు 520 కిలోమీటర్లు, న్యూదిల్లీకి 720కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం నిఘావర్గాలు గుర్తించిన ప్రాంతలో రెండు సొరంగ మార్గాలు, మూడంచెల్లో కంచె, ఒక కార్యాలయం, మిషినికల్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ, గారేజీలు, నివాస సముదాయాలు ఉన్నాయి.శత్రువుపై తొలిసారి దాడిచేసే సామర్థ్యాన్ని పాక్ బలోపేతం చేసుకోని ప్రతి దాడికి కూడా ఏర్పాట్లు చేస్తోంది. పాక్ రహస్యంగా అణ్వాయిధాలను భద్రపర్చే స్థావరాలు నిర్మించడం ఇదే తొలిసారి కాదు. భారత్ దాడి నుంచి రక్షించుకోవడానికి ఇప్పటికే పలు స్థావరాలు నిర్మించింది. గూగుల్ ఎర్త్‌లో పలు చోట్ల పాక్ న్యూక్లియర్ స్థావరాల కోసం తవ్విన సొరంగాలను భారత నిఘా వర్గాలు గుర్తించాయి. 2003 నుంచి 2011వరకు సొరంగాల తవ్వకాలను పాక్ చేపట్టింది. కాకపోతే అప్పట్లో భారత్‌కు ఈ విషయాలు తెలియకుండా పాక్ జాగ్రత్తలు తీసుకుంది. పాక్ వద్ద అధికారికంగా 140 అణువార్హెడ్ల్ ఉన్నాయి. అనధికారికంగా ఎన్ని ఉన్నాయో ఎవరికీ తెలియదు.
క్షమించాలి మీరు వార్త మీద ఇష్టం లేదా వ్యతిరేకత ఇవ్వాలంటే మీరు లాగిన్ అయి ఉండవలెను .
LOGIN
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే ఇష్టపడి ఉన్నారు
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే వ్యతిరేకించి ఉన్నారు
అభిప్రాయాలూ