కుల్ భూషణ్ మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కుల్ భూషణ్ మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే

న్యూ ఢిల్లీ మే 18:గూఢచర్యం ఆరోప‌ణ‌ల‌పై భార‌త నౌకాద‌ళ మాజీ అధికారి కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌కు పాకిస్థాన్ ఆర్మీకోర్టు మ‌ర‌ణ‌శిక్ష విధించిన విష‌యంపై అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానంలో ఈ రోజు మధ్యంతర తీర్పు వెలువ‌డింది. 'ది హేగ్' ‌నగరంలోని అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానంలో ఈ తీర్పును 11 మంది న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం వెల్ల‌డించింది. కుల్‌భూష‌ణ్ జాద‌వ్ కేసు అంశంపై పాకిస్థాన్ చేస్తోన్న వాదనలు సరికావని అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడు రోన్నే అన్నారు. పాక్ ఆర్మీ విధించిన ఈ మరణశిక్షతీర్పుపైస్టేవిధిస్తున్నట్లుపేర్కొన్నారు.జాద‌వ్ అరెస్టు భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య వివాదాస్ప‌దమైంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. దీంతో భార‌త్ అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించింద‌ని వివ‌రించారు. పాక్ ఈ కేసులో తెలుపుతున్న అభ్యంత‌రాల‌ను ఆయ‌న తోసిపుచ్చారు. వియన్నా ఒప్పందం ప్రకారం కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌ను క‌లిసే హ‌క్కు భార‌త్‌కు ఉంద‌ని తెలిపారు. వియన్నా ఒప్పందంలో భారత్, పాకిస్థాన్ లు భాగస్వాములని ఆయన గుర్తు చేశారు. ఈ కేసు అంతర్జాతీయ న్యాయస్థానం పరిధిలోకి రాదన్న పాకిస్థాన్ వాదనను తాము తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ లో జాదవ్ ను కలుసుకునేందుకు భారత దౌత్య అధికారులకు అనుమతి ఇవ్వాలని తెలిపారు. తమ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని చెప్పారు. ఈ సంద‌ర్భంగా అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం పాకిస్థాన్ తీరును ఎండ‌గ‌ట్టింది. కుల్ భూష‌ణ్ జాద‌వ్‌ను పాకిస్థాన్ అరెస్టు చేసిన తీరు వివాదాస్ప‌దంగా ఉంద‌ని వ్యాఖ్యానించింది. తుది తీర్పు వెలువ‌డేవ‌ర‌కు కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌ను ఉరితీయ‌కూడ‌దని ఆదేశించింది. కుల్‌భూష‌ణ్ జాద‌వ్ భార‌తీయుడ‌ని భార‌త్, పాక్ అంగీక‌రించాయ‌ని, ఈ రెండు దేశాలు వియ‌న్నా ఒప్పందంలో భాగ‌స్వాములుగా ఉన్న నేప‌థ్యంలో నిబంధ‌న‌ల ప్రకారం తాము త్వ‌ర‌లో తుది తీర్పును వెల్ల‌డిస్తామ‌ని తెలిపింది. తమ నుంచి తుది తీర్పు వచ్చేవరకు జాద‌వ్‌ను ఉరితీయ‌బోమ‌ని పాకిస్థాన్ హామీ ఇవ్వాలని అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం ఆదేశించింది.భారత్ ఈ కేసును అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేయ‌డంతో ఇటీవ‌లే అంత‌ర్జాతీయ న్యాయస్థానంలో కుల్ భూష‌ణ్ జాదవ్ ఉరిశిక్షపై స్టే వ‌చ్చిన విష‌యం తెలిసిందే. రెండు రోజుల క్రితం భార‌త్, పాకిస్థాన్‌లు అంత‌ర్జాతీయ న్యాయస్థానంలో త‌మ త‌మ వాద‌న‌లు వినిపించగా ఈ కేసుకి అవ‌స‌ర‌మైన ఆధారాల‌ను పాకిస్థాన్ స‌మ‌ర్పించ‌లేక‌పోయింది. దీంతో భార‌త్‌కు అనుకూలంగానే ఈ తీర్పు వ‌చ్చింది. కుల్‌భూష‌ణ్ కేసులో భార‌త్‌కు అనుకూలంగా తీర్పురావ‌డ‌తో ముంబ‌యితో పాటు ప‌లు ప్రాంతాల్లో భార‌తీయులు ట‌పాసులు కాల్చి సంబ‌రాలు చేసుకుంటున్నారు.

కాగా కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌కు పాకిస్థాన్ విధించిన మరణశిక్ష కేసులో అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పు ప‌ట్ల అటార్నీ జ‌న‌ర‌ల్ ముకుల్ రోహ‌త్గి స్పందించారు. ఓ జాతీయ మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ.. న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పు ప‌ట్ల హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానం తుది తీర్పు కూడా భార‌త్‌కు అనుకూలంగానే వ‌స్తుంద‌ని, కుల్‌భూష‌ణ్ జాద‌వ్ తిరిగి భార‌త్‌కు వ‌స్తార‌ని ఆశిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ రోజు న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర తీర్పు పాక్ తీరుని ఎండ‌గ‌ట్టింద‌ని, ఇది భార‌త్‌కు పెద్ద విజ‌యమ‌ని అన్నారు. పాకిస్థాన్ తీరుని భార‌త్‌ అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం ముందు బ‌ట్ట‌బ‌య‌లు చేసిందని, భార‌త విదేశాంగ శాఖ చేసిన కృషి ప్రశంస‌నీయ‌మ‌ని ఆయ‌న అన్నారు.

కుల్ భూషణ్ జాదవ్ కేసులో తీర్పుపై సుష్మాస్వరాజ్ కు మోదీ ఫోన్భార‌తీయ నేవీ మాజీ అధికారి కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌ను గూఢ‌చారిగా చిత్రీక‌రిస్తూ ఎటువంటి ఆధారాలు లేకుండానే పాకిస్థాన్‌ ఉరిశిక్ష విధించిన‌ కేసులో అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పు ప‌ట్ల స్పందిస్తూ విదేశాంగ మంత్రి సుష్మాస్వ‌రాజ్‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఈ రోజు న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పు ప‌ట్ల మోదీ సంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ కేసును అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానంలో దీటుగా వాదించిన హ‌రీశ్ సాల్వేనిఅభినందిస్తున్న‌ట్లుమోదీపేర్కొన్నారు. అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పు ప‌ట్ల సుష్మా స్వ‌రాజ్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానంలో ఇండియా త‌ర‌ఫున స‌మ‌ర్థవంతంగా వాదించిన హ‌రీశ్ సాల్వీని అభినందిస్తున్న‌ట్లు ఆమె త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌ను భార‌త్‌కు రప్పించేందుకు ఉన్న ఏ అవ‌కాశాన్నీ తాము వ‌ద‌లబోమ‌ని ఆమె ఉద్ఘాటించారు. ఈ రోజు న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పుప‌ట్ల కుల్‌భూష‌ణ్‌జాద‌వ్ కుటుంబ స‌భ్యుల‌తో పాటు యావ‌త్ భార‌తీయులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నార‌ని ఆమె పేర్కొన్నారు.

(220)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ