రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే లా అండ్ ఆర్డర్ సరిగా ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు. కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులిస్తున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన క్షేత్రస్థాయి అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.ఈ సమావేశానికి ఎస్ఐ స్థాయి నుంచి పోలీసు అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 1700 పరిశ్రమలు ఉత్పత్తులు ప్రారంభించాయన్నారు. శాంతిభద్రతలను పటిష్టంగా కాపాడితే, రాష్ట్రానికి కావాల్సిన మిగితా పని తాను చూసుకోనున్నట్లు చెప్పారు. ఎస్సై అనుకుంటే రాష్ట్రంలో జరగలేనిది ఏదీ లేదన్నారు. రాష్ట్రంలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ను నాస్కామ్ ఆపేసిన అంశాన్ని సీఎం గుర్తు చేశారు. నకిలీ సర్టిఫికెట్లు ఎక్కువ కావడం వల్ల ఆ పరిస్థితి వచ్చిందని, ఆ అంశంలో ఉన్నత స్థాయి పోలీసు అధికారులతో చర్చలు నిర్వహించి వాటిని అరికట్టే పరిస్థితి తీసుకువచ్చామన్నారు.
పోలీస్ ప్రమోషన్లలో పైరవీలకు తావుండొద్దని సీఎం కేసీఆర్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. పోలీసుశాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగికి వారికి న్యాయంగా రావలిసిన ప్రమోషన్‌ను సమయానికి ఇవ్వాలని ఆదేశించారు. ఇందులో ఎలాంటి వ్యక్తిగత కక్షలు, పైరవీలకు తావివ్వొద్దన్నారు. ప్రమోషన్ అనేది రావలిసిన సమయానికి వస్తే సంబంధిత అధికారి తన విధులపై దృష్టి పెట్టడానికి అస్కారం ఉంటుందన్నారు. లేకపోతే పనిని పక్కనబెట్టి ప్రమోషన్కోసం అధికారుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని సీఎం వివరించారు. దయచేసి గతంలో ఉన్న చెడు కల్చర్‌కు స్వస్తి పలకాలని, పోలీసులంటే ప్రజను భయపెట్టే విలన్లుగా కాకుండా తెలంగాణ పోలీస్ అంటే ప్రజలను రక్షించే హీరోలుగా పేరు తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.. పోలీసుల్లో మంచి ప్రవర్తన గురించి వారికి తెలియజేశారు. క్షేత్రస్థాయి పోలీసు అధికారులతో సీఎం కేసీఆర్ మొదటిసారిగా
రాష్ట్రంలో గుడుంబా రోజులు పోయాయన్నారు. 99 శాతం గుడుంబా వెళ్లిపోయిందన్నారు. గుడుంబా నియంత్రణ కోసం ఎక్సైజ్ శాఖ చేసిన కసరత్తులను సీఎం మెచ్చుకున్నారు. గుడుంబా లేని గ్రామాలను తయారు చేయాలని సీఎం పోలీసులను కోరారు. సప్త మహా వ్యవసనాల్లో జూదం ఒకటి అని, అది కూడా ఆల్మోస్ట్ పోయిందన్నారు. పోలీసులు కఠినంగా ఉంటే అది కూడా పోతుందన్నారు. ప్రజలకు ప్రాణాంతకంగా ఉన్నటువంటి మట్కా, గుట్కాలను కూడా వంద శాతం రూపుమాపాలన్నారు. మంచి సమాజం ఎక్కడో ఉండదని, అది మనం తయారుచేస్తేనేఅవుతుందన్నారు. జిస్కా కోయీ నహీ హోతా హై, ఉస్కా తెలంగాణ పోలీస్ హోతా అన్న విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నారు. డీజేపీ అనుకున్నదానికంటే ఎస్సై అనుకుంటే చాలా సాధించవచ్చు అని సీఎం అన్నారు. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే మట్కా, గుట్కాను పూర్తిగా నిర్మూలిస్తారో, ఆ ఆఫీసర్‌ను గుర్తిస్తామన్నారు. నకిలీ నోట్లు, స్టాంపులు, కరెన్సీ, ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయన్నారు. పలానా ఎస్సై ఇలాఖాలో ఇలా జరగవన్న భావన రావాలన్నారు. కల్తీలను నిరోధించేందుకు మీ వంత ప్రయత్నం మీరు చేయాలన్నారు. సమాజంలో మహిళల రక్షణకు టాప్ ప్రయారిటీ ఇవ్వాలన్నారు. మహిళల పట్ల పోలీసులు తల్లితండ్రులుగా బిహేవ్ చేయాలన్నారు. ఈ ప్యారామీటర్స్పాటిస్తేఅభివృద్ధిసాధ్యమన్నారు. పోలీసు శాఖకు కావాల్సిన అల్ట్రా మాడ్రన్ వెపన్స్ తెప్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. పోలీసులకు కావాల్సిన టెక్నాలజీని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కానిస్టేబుళ్లకు ఐప్యాడ్ ట్రైనింగ్ ఇస్తున్నారని సీఎం గుర్తు చేశారు. హోంగార్డులకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయన్నారు . ఎఫెక్టివ్ సర్వీస్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. క్రైమ్ మీటింగ్ పేరుతో పోలీసులు నిర్వహించే సమావేశాల పేరును మార్చాలని సూచించారు. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రొఫైల్ మారాలన్నారు. కానిస్టేబుల్ చెట్టు కింద కూర్చునే పరిస్థితి పోవాలన్నారు. పోలీస్ స్టేషన్ రిసెప్షన్ కౌంటర్లు స్టార్ హోటళ్ల తరహాలో ఉన్నాయన్న కితాబులు వస్తున్నాయని సీఎం అన్నారు.
ఎవరికైతే రక్షణ అవసరమో, అండ కావాలో, వారికి పోలీసులు మద్దతుగా ఉండాలన్నారు. పోలీస్ అంటే భయం పోయి, పోలీస్ ఈజ్ మై ఫ్రెండ్ అన్న భావన రావాలని సీఎం అన్నారు. రాష్ట్ర పోలీస్ కాన్ఫరెన్స్ ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తే బాగుంటుందన్నారు. దీని వల్ల మనకు వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఇంటరాక్షన్ పెరిగితే మనకు బాగా లాభం జరిగే వీలుందని సీఎం తెలిపారు. దేశ ప్రధాని, కేంద్ర హోంమంత్రి సుమారు డజన్ సార్లు మనల్ని మెచ్చుకున్నారని, తెలంగాణ పోలీస్ హమ్కో మదద్ కర్రే అని ప్రశంసించారన్నారు. ఎప్పటికప్పుడూ సమీక్ష నిర్వహిస్తూ, రిఫైన్ చేసుకుంటూ ముందుకు వెళ్తే, వీ విల్ బీ లీడింగ్ ద కంట్రీ అని సీఎం అన్నారు. ఆర్థికపరంగా, చట్ట పరంగా పోలీస్‌శాఖను బలపరుస్తామన్నారు. ఎక్సలెంట్ లా అండ్ ఆర్డర్ ఎక్కడుందంటే, తెలంగాణలో అన్న మాట వినబడాలన్నారు. పెట్టుబడుదారులకు తెలంగాణ స్వర్గధామం అన్న ఆలోచన రావాలన్నారు. చాలా తక్కవ సమయంలో తెలంగాణ ఉత్తమంగా రాణించగలిందన్నారు. మీరు చేసే పనిలో సంపూర్ణ విజయాన్ని సాధించాలని, దానికి కావాల్సిన పరిస్థితులను భగవంతుడు మీకు కల్పించాలని సీఎం ఆకాంక్షించారు.
క్షమించాలి మీరు వార్త మీద ఇష్టం లేదా వ్యతిరేకత ఇవ్వాలంటే మీరు లాగిన్ అయి ఉండవలెను .
LOGIN
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే ఇష్టపడి ఉన్నారు
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే వ్యతిరేకించి ఉన్నారు
అభిప్రాయాలూ