WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎండ దాటికి కాలి బూడిదైన బైక్‌...!

ఎండ ధాటికి ద్విక్రవాహనం వాహనం కాలి బూడిదైంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలంలో ఘటన చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామానికి చెందిన బూదూరి లక్ష్మయ్య - లలిత దంపతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగే వివాహానికి వెళుతున్నారు. వినోభానగర్ గ్రామం సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న ద్విచక్రహనానికి ఆకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి...క్షణాల్లో యాక్టీవా వాహనం దగ్దమైంది...భయబ్రాoతులకు గురైన దంపతులు వాహనాన్ని వదిలి పొలాల్లోకి పరుగులు పెట్టారు.... వాహనం లోని రూ.3000 రూపాయల నగదు, దుస్తులు దగ్దమైనట్లు భాదితులు తెలిపారు.ఎండ తీవ్రతకు ఇంజన్ హీట్ఎక్కి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

(204)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ