WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆరోగ్య సంర‌క్ష‌ణలో బంగ్లాదేశ్‌ కన్నా వెనుకబడ్డ భారత్

 ద‌క్షిణాసియాలో చిన్న చిన్న దేశాల‌కు పెద్ద‌న్న‌లాగా ఉంటున్నాభారత్ కొన్ని విష‌యాల్లో ఇప్ప‌టికీ వాటి కంటే వెనుక‌బ‌డే ఉంది తాజాగా విడుద‌లైన ఆరోగ్య సంర‌క్ష‌ణ ర్యాంకుల్లో పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌, శ్రీలంక‌ల కంటే భార‌త్ వెనుక‌బ‌డి ఉండ‌టం గ‌మ‌నార్హం. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఇప్ప‌టికీ ఆరోగ్య సంర‌క్ష‌ణ‌లో అనుకున్న ల‌క్ష్యాల‌ను మాత్రం సాధించ‌లేక‌పోతున్న‌ది. గ్లోబ‌ల్ బ‌ర్డెన్ ఆఫ్ డిసీజ్ అనే సంస్థ తాజాగా ప్ర‌క‌టించిన 195 దేశాల ర్యాంకుల్లో ఇండియా 154వ స్థానంతో స‌రిపెట్టుకుంది. నాణ్య‌మైన వైద్యం, అందుబాటులో వైద్యం అంశాల ఆధారంగా ఈ ర్యాంకుల‌ను కేటాయించింది. 1990తో పోలిస్తే తాజా ర్యాంకుల్లో చైనా, సౌత్‌కొరియా, పెరులాంటి దేశాలు చాలా మెరుగైన ప్ర‌ద‌ర్శ‌నచేశాయి. ఆరోగ్య సంర‌క్ష‌ణ స్కోర్ల‌లో చైనా 74, శ్రీలంక 73, బంగ్లాదేశ్ 52 పాయింట్లు సాధించ‌గా.. భార‌త్ 44.8 పాయింట్ల‌తో స‌రిపెట్టుకుంది. 1990తో పోలిస్తే భార‌త్ 14.1 పాయింట్లు ఎక్కువ‌గా సాధించినా.. అనుకున్న ల‌క్ష్యాల‌ను మాత్రం అందుకోలేక‌పోయింది. టీబీ, డ‌యాబెటిస్‌, గుండె, కిడ్నీల‌కు సంబంధించిన వ్యాధుల‌ను అరిక‌ట్ట‌డంలో భార‌త్ ఘోరంగా విఫ‌ల‌మైన‌ట్లు తాజా నివేదిక వెల్ల‌డించింది. కెన‌డా, ఆస్ట్రేలియా, జ‌పాన్‌ల‌తోపాటు యూర‌ప్‌లోని దేశాలు మంచి స్కోర్లు సాధించాయి. ధ‌నిక దేశాల్లో అమెరికా ర్యాంకు మ‌రీ దిగజారిపోయింది. అమెరికా 35వ స్థానంతో స‌రిపెట్టుకుంది.

(270)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ