WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నిప్పుల కొలిమిలో తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. భానుడి భగభగలకు ప్రజలు విలవిలలాడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మండుతున్నాయి. దీనికితోడు వాయువ్య భారత్‌నుంచి వీస్తున్న వేడి గాలులు వేడిమిని మరింతగా పెంచుతున్నాయి. దీంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతల తీవ్రత సాధారణం కంటే 4 నుంచి 7 డిగ్రీల మేర పెరిగినట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ ఎండల తీవ్రతకు ఉక్కపోత పరిస్థితులు నెలకొన్నాయి. 

   రాత్రి పదిగంటలకు కూడా వడగాల్పులు తగ్గకపోవడంతో బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. మరోవైపు కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో క్యూములోనింబస్‌ మేఘాల కారణంగా ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు పడటంతో ఆయా ప్రాంతాల్లో కాస్త ఉష్ణోగ్రతలు దిగివచ్చాయి. అయితే ఉష్ణోగ్రతల తీవ్రత మరో రెండు మూడు రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ప్రత్యేకించి వాయువ్యం నుంచి వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావంతో గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలోని పలుచోట్ల నేరుగా పడుతోందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఆ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉందని స్పష్టంచేసింది

(151)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ