WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రజాస్వామ్యం క్షీణించింది...!

ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ అధ్వాన్నంగా తయారైంది. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాల్సి ఉందని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అన్నారు. కొద్దిరోజులుగా తన అభిమానులతో ప్రాంతాల వారీగా సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. చివరి రోజైన శుక్రవారం తమ అభిమాన నటుడిని కలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నేను కర్ణాటకలో 23ఏళ్లు ఉన్నాను, తమిళనాడులో 43ఏళ్లుగా నివసిస్తున్నాను. నేను కర్ణాటక వాడినైనా మీరు నన్ను స్వాగతించి నిజమైన తమిళుడిగా ఆదరించారు. రాజకీయాల్లో ఎంతో మంది సీనియర్‌ నాయకులు ఉన్నారు, జాతీయ పార్టీలు ఉన్నాయి.. కానీ రాజకీయ పరిస్థితి మాత్రం సక్రమంగా లేదు. ప్రజాస్వామ్యం క్షీణించింది. ఈ వ్యవస్థ మారాలి. ప్రజల ఆలోచనల్లోనూ మార్పు రావాలి, అప్పుడే దేశం సరైన మార్గంలో పయనిస్తుంది’ అని రజనీ అన్నారు.. రాజ‌కీయాల్లోకి వ‌స్తాడా రాడా అన్న‌ది నేరుగా చెప్ప‌కుండా.. రోజుకో ట్విస్ట్‌తో ఉత్కంఠ పెంచుతున్నాడు. మ‌న ద‌గ్గ‌ర మంచి నాయ‌కులు ఉన్నా.. వ్య‌వ‌స్థ స‌రిగా లేక వాళ్లు ఏమీ చేయ‌లేక‌పోతున్నార‌ని అన్నాడు. ఇలా చెబుతూ.. అత‌ను డీఎంకే నేత స్టాలిన్ పేరు చెప్ప‌డం ఆస‌క్తి రేపుతున్న‌ది. త‌మిళ రాజ‌కీయాల్లోనూ స్టాలిన్‌, అన్బుమ‌ని రాందాస్‌, తిరుమ‌వ‌ల‌వ‌న్‌లాంటి మంచి నేతలు ఉన్నా.. వ్య‌వ‌స్థ వారిని స‌రిగా ప‌నిచేయ‌నివ్వ‌డం లేదు. స్టాలిన్ స‌మ‌ర్థుడే ఆయ‌న కూడా ఏమీ చేయ‌లేక‌పోతున్నారంటే దానికి కార‌ణం వ్య‌వ‌స్థే అని ర‌జనీ అన్నాడు.

(287)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ